దేశంలో ఉండేది తక్కువ.. విదేశాల్లో ఉండేదే ఎక్కువ అంటూ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రతిపక్షాలు తరచూ విమర్శలు చేస్తుండటం తెలిసిందే. ఆ మధ్యలో అయితే మోడీ ఫారిన్ ట్రిప్స్ మీద తరచూ భారీ జోకులు పేలేవి. ఎన్ ఆర్ ఐ ప్రధాని అని కొన్ని రాజకీయ పక్షాలు తప్పు పడితే.. అరే.. మోడీ దేశంలోనే ఉన్నారంటూ కొందరి నోట వచ్చే మాటలు మోడీ ఇమేజ్ ను ఎంతోకొంత డ్యామేజ్ చేశాయని చెప్పక తప్పదు.
విదేశీ పర్యటనల విషయంలో మోడీని అందరూ ఆడిపోసుకుంటారు కానీ.. గడిచిన మూడేళ్ల పదవీ కాలంలో ఆయన చేసిన ఫారిన్ ట్రిప్స్ చాలా తక్కువగా తేలుస్తూ.. ఆసక్తికరమైన లెక్క ఒకటి చెప్పుకొచ్చారు బీజేపీ చీఫ్ అమిత్ షా. అందరూ అనుకున్నట్లుగా మోడీ సర్కారు విదేశీ పర్యటనలు ఎక్కువనుకోవటం తప్పు అని చెప్పటమే కాదు.. తన వాదనకు బలం చేకూరే గణాంకాల్ని ఉటంకిస్తారు అమిత్ షా.
వాస్తవానికి మోడీ కంటే కూడా యూపీఏ సర్కారు హయాంలో ప్రధానిగా వ్యవహరించిన మన్మోమన్ సింగ్ తో పోల్చి చూసినా.. మోడీ ఫారిన్ ట్రిప్స్ తక్కువని చెప్పుకొచ్చారు అమిత్ షా. ప్రధాని హోదాలో మన్మోహన్ చేసిన విదేశీ పర్యటనలకు మీడియాలో అంత ప్రచారం లబించకపోవటం తెలీలేదు కానీ.. మన్మోహన్ విదేశీ పర్యటనలు ఎక్కువన్నారు. మన్మోహన్ తొలిసారిగా ప్రధాని బాధ్యతల్ని చేపట్టిన 144 రోజుల్లో 38 దేశాల్లో పర్యటిస్తే.. రెండోసారి ప్రధానిగా 161 రోజుల్లో 38 దేశాల్లో పర్యటించారన్నారు. ప్రస్తుత ప్రధాని మోడీ మాత్రం ఇప్పటి వరకూ 56 దేశాల్లో పర్యటించినట్లుగా చెప్పుకొచ్చారు. మన్మోహన్ విదేశీ పర్యటల్ని నెలలకు కుదించేబదులు.. మూడేళ్ల ప్రాతిపదికన లెక్క వేసి చూపించాల్సింది పోయి.. అంకెల గారడీతో అమిత్ షా లెక్క ఉన్నట్లుగా కనిపించక మానదు. ఏమైనా రాజకీయ నేతల తమకు అనుగుణంగా గణాంకాల్ని ఎంతగా మారుస్తారన్నది తాజా లెక్క చూస్తే ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/