బీజేపీ రథసారథి - ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆప్తుడు - పార్టీలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జాతీయ రాజకీయాల్లో తన మలి దశ ప్రయాణానికి రంగం సిద్ధః చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. గుజరాత్ నుంచి రాజ్యసభకు `ఎట్టి పరిస్థితుల్లోనూ`` ఎన్నికయేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్న అమిత్ షా త్వరలో కేంద్ర మంత్రి కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అందులోనూ కీలకమైన రోణ శాఖ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. అయితే రక్షణ శాఖ మంత్రి కాకముందే...అమిత్ షా తన బాధ్యతల విషయంలో పూర్తి క్లారిటీతో ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడిన సమస్యల్లో భద్రత అంశాలే ఎక్కువగా ఉండటం గమనార్హం. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఉగ్రస్వరూపాన్ని ఎండగట్టి దాన్ని ఏకాకిని చేయగలిగామని ఇందుకు కారణం గత మూడేళ్లుగా నరేంద్ర మోడీ సారధ్యంలోని ఎన్ డిఏ ప్రభుత్వం చేపట్టిన చర్యలేనని అన్నారు.
ఈ మూడు సంవత్సరాల్లో ప్రధాని మోడీ చేసిన కృషి వల్లే పాకిస్తాన్ అసలు స్వరూపం బయటపడిందని ప్రపంచ దేశాలు అన్ని కూడా ఉగ్రవాదంపై దానిని ఏకాకిని చేశాయని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఎందరో ఉగ్రవాదులను హతమార్చడం జరిగిందని అలాంటి చర్యలను గత ప్రభుత్వం తీసుకోలేదని షా అన్నారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులకు నిధులు అందకుండా తొలిసారిగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది కేంద్రంలోని తమ ప్రభుత్వమేనని అమిత్ షా గుర్తుచేశారు. కాశ్మీర్ సమస్య పరిష్కారం విషయంలో గత ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయే తప్ప ముందుకు వెళ్లలేదని విమర్శించారు. ఉగ్రవాదులకు అందుతున్న నిధులను కట్టడి చేయడంలో కఠినంగా వ్యవహరించగలిగింది తమ ప్రభుత్వం ఒక్కటేనని ఆ ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని మీడియా సమావేశంలో అమిత్ షా ఉద్ఘాటించారు. కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370 రాజ్యాంగ అధికరణపై సమాధానం ఇవ్వకుండా దాటవేసిన అమిత్‌షా ‘ఇందుకు సంబంధించి అనేక అంశాలలు ఉంటాయన్న విషయం మీ అందరికీ తెలుసు’అని అన్నారు.
కేంద్రంలో తొలిసారిగా ఓ నిర్ణయాత్మకైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని భారత్ ను అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా పెంపొందించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటోందని బీజేపీ చీఫ్ స్పష్టం చేశారు. ఈ మూడేళ్లలో అవినీతి రహితమైన పాలనను అందించామని వెల్లడించిన ఆయన ఈ విషయంలో ప్రతిపక్షాలు కూడా తమవైపువేలెత్తిచూపే పరిస్థితి లేదన్నారు. పేదలకు బ్యాంక్ ఖాతాలు తెరవడం - గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం - పన్నుల వ్యవస్థను క్రమబద్దీకరించడం - ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్ అమలు, పాకిస్తాన్ పై లక్షిత దాడులు నిర్వహించడం పేదలకు అందుబాటులో ఉండేలా మందుల ధరలు తగ్గించేలా మోడీ ప్రభుత్వం 50కి పైగా కీలక నిర్ణయాలు తీసుకుందని అమిత్ షా గుర్తుచేశారు.