ఎక్కడ పొరపాటు జరిగిందో కానీ.. బిగ్ బి అమితాబ్ కు ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుపోయారు. ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీల్లో భాగంగా కిసాన్ ఛానల్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసిందే. ఈ ఛానల్ కోసం కేంద్ర ఆర్థిక మంత్రి రూ.100కోట్లు కేటాయించారు.
అయితే.. ఈ ఛానల్ ప్రచారం కోసం బ్రాండ్ అంబాసిడర్ గా బిగ్ బిని ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి.ఈ అంశం పెద్దగా ఆసక్తి రేపలేదు కానీ.. సర్కారీ కిసాన్ ఛానల్ లో అంబాసిడర్ గా వ్యవహరించేందుకు అమితాబ్ రూ.6.31కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనికి ఆధారం ఏమిటో తెలీకున్నా.. ఈ వార్త వచ్చిన వెంటనే తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
దీనిపై స్పందించిన అమితాబ్ తాను భారీ మొత్తాన్ని అస్సలు కోరలేదని.. అసలు అలాంటి ఒప్పందంపై తాను సంతకం చేయలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను ఎన్నో కార్యక్రమాలకు ఉచితంగా పని చేశానని.. రైతులకు సంబంధించిన ఈ కార్యక్రమంలో తాను ఉచితంగానే పని చేయనున్నట్లు పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాల కోసం ఉద్దేశించి కాబట్టి.. తాను ఉచితంగా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
చేతికి పైసా రాకున్నా.. భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్ గా పొందుతున్న వార్తల పుణ్యమా అని బిగ్ బి పేరు ప్రఖ్యాతలు భారీగా డ్యామేజ్ అయిన పరిస్థితి. అయితే.. ఈ వివాదం అంతా ఎక్కడ మొదలైందంటే.. కిసాన్ ఛానల్.. లింటాస్ సంస్థతో రూ.8.6కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే.. ఈ సంస్థ బిగ్ బితో కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రకటించి.. 2016 వరకు కాంటాక్ట్ ఉందని పేర్కొంటూ.. అమితాబ్ రెమ్యూనరేషన్ ను ఘనంగా ప్రకటించింది.
అది కాస్త రచ్చ అయ్యే సరికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రెమ్యూనరేషన్ కు సంబంధించిన ఏ అంశం మీదన బిగ్ బి సంతకం చేయలేదని ఆయన స్వయంగా చెబుతున్నారు. భారీ రెమ్యూనరేషన్ విషయంలో తాను సంతకం చేసినట్లుగా చూపించే కాగితాల్ని ప్రదర్శించాలని ఆయన కోరుతున్నారు. చూస్తుంటే.. బిగ్ బి చేతికి డబ్బులు వచ్చినా రాకున్నా.. ఆ పేరు మీద లింటాస్ చేసిన ప్రచారం.. ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయనటంలో సందేహం లేదు.