బిగ్ బీ.. దేశ ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. అలాంటి బిగ్ బీ ఎంతో ఎత్తుకు ఎదిగినా తనలోని వినయాన్ని మరోసారి ప్రదర్శించి అందరి మనసుల్నిదోచుకున్నారు. మోడీ సర్కారు పాలన రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన బిగ్ బి అమితాబ్ కు ఒక ఊహించని ప్రశ్న ఎదురైంది. వాస్తవానికి ఈ కార్యక్రమానికి బిగ్ బీ వ్యాఖ్యతగా వ్యవహరించాల్సి ఉన్నా.. రాజకీయ పక్షాల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆయన.. కేంద్ర సర్కారు చేపట్టిన బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమానికి మాత్రమే వ్యాఖ్యతగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అమితాబ్ ను వేసిన ప్రశ్న అందరిని ఆకట్టుకోవటమే కాదు.. ఆ ప్రశ్నకు ఆయనేం సమాధానం చెబుతారా? అంటూ ఆసక్తిని రేకెత్తించింది. ఇంతకీ ఆ చిన్నారి వేసిన ప్రశ్న ఏమిటంటే.. ‘‘మీకు బిగ్ బీ అన్న పేరు ఎలా వచ్చింది?’’ అంటూ ప్రశ్నించింది. ఈ ప్రశ్న విన్న వెంటనే అప్పటివరకూ నిలుచొని మాట్లాడుతున్న అమితాబ్ ఒక్కసారిగా ఆ చిన్నారి ముందు బాసింపట్టు వేసుకొని కూర్చొని.. ‘‘చూశావా.. నేను నీ కంటే చిన్నగా ఉన్నాను’’ అని చమత్కరించి.. ఆ పేరును మీడియా తనకు పెట్టిందని చెప్పుకొచ్చారు. చిన్నారి అడిగిన ప్రశ్నకు అమితాబ్ వ్యవహరించిన తీరు అందరిని ఆకట్టుకునేలా చేయటమే కాదు.. మేరునగం లాంటి ఆయన ఎంత వినయంగా ఉంటారన్న విషయం మరోసారి అందరికి తెలిసేలా చేసిందని చెప్పాలి.