సాధారణంగా ఏ రాష్ట్రంలో అయిన ఏ పార్టీలో అయిన కూడా ప్రతిపక్ష పార్టీ నుండో ..లేక ఇంకో పార్టీ నుండో అధికారం లో ఉన్న పార్టీలోకి కొంతమంది నేతలు తమ రాజకీయ భవిష్యత్ కోసమని చెప్పి ... ఓట్లు వేసిన ఓటర్లని మర్చిపోయి ఇతర పార్టీల్లోకి జంప్ అవుతుంటారు. ఇది ప్రస్తుత రాజకీయాలలో చాలా కామన్. చొక్కాలు మార్చినంత ఈజీగా కొంతమంది పార్టీల కండువాలు మార్చుతున్నారు. ఇకపోతే ఏపీలో కూడా ప్రస్తుతం వలసల రాజకీయం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీడీపీ ఎంపీ లు కొంతమంది బీజేపీ గూటికి చేరిపోయారు. అలాగే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ కి రాజీనామా చేసి ..వైసీపీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటువంటి తరుణంలో వైసీపీకి పెద్ద షాక్ తగలబోతుందా? అంటే అవుననే వినిపిస్తోంది. వైసీపీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదు అని చెప్పి ..ఒక సీనియర్ నేత అతి త్వరలో బీజేపీ లో జాయిన్ కావడానికి సిద్దమౌతున్నారని సమాచారం.
ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఆ సీనియర్ నేతకి బీజేపీ నుంచి మంచి ఆఫర్ వచ్చినట్లు రాజకీయవర్గాల నుంచి వినిపిస్తోంది. అయన మరెవరో కాదు మాజీ మంత్రి - వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి. సొంతపార్టీ నేతలపై ఆనం చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన పార్టీ మార్పుపై ప్రచారం జరుగుతోంది. రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో కీలకమైన శాఖలు నిర్వహించిన ఆనం - ఆ తర్వాత రోశయ్య - కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా కీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న దశాబ్ధ కాలంలో రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పారు. ఆ తరువాత మారిన సమీకరణాల నేపథ్యంలో అయన టీడీపీలో చేరారు.
ఆత్మకూరు నియోజకవర్గానికి ఇన్ చార్జ్ గా వ్యవహరించే టైమ్ లోనే స్థానికంగా ఉన్న నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యత అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనకు ఇవ్వడం లేదని కోపంతో ఆనం టిడిపికి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఆయనకు వెంకటగిరి టికెట్‌ను ఇచ్చారు. ఆ ఎన్నికలలో గెలిచిన ఆయనకి మంత్రి పదవి ఖాయం అని అనుకున్నారు. కానీ , జగన్ ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు. అప్పటి నుంచి కొంత అసంతృప్తిగా నే ఉంటూ వస్తున్నారు.
అధికార పార్టీలో ఉండి కూడా తమ ఆధీనంలో ఉన్న వాటిపై సొంత పార్టీ నేతలే విచారణకు ప్రయత్నం చేయడం ఆయన మరింత ఆవేదనకు గురైనట్లు చెబుతున్నారు. ఇదే విషయంపైనే ఆయన గత కొంతకాలంగా మౌనంగా ఉంటూ నాలుగు రోజుల క్రితమే ఎస్పీ బదిలీ వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకొని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆనంకు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన, నాయకులతో పరిచయాలున్నాయి. అలాగే చాలామంది కాంగ్రెస్ లో కీకాలంగా వ్యవహరించినవారు కూడా ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. వారందరి పిలుపు మేరకు ఇష్టంలేని వైసీపీలో కష్టంగా కొనసాగడం కంటే తనకు తగిన ప్రాధాన్యతనిచ్చే జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరడమే ఉత్తమమన్న ఆలోచనకు వస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఆనం బీజేపీలో చేరితే రాష్ట్రస్థాయిలో కీలకమైన పగ్గాలను అప్పగించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది.