ఆంధ్ర బ్యాంకు రుణమాఫీకి రాయపాటి ట్రయల్స్?

Update: 2016-11-18 17:30 GMT
పోలవరం యమ స్పీడుగా పూర్తి చేస్తామని చంద్రబాబు చెబుతున్నా అక్కడ సీను మాత్రం తేడాగా ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పోలవరం పనులు దక్కించుకున్న ఎంపీ రాయపాటి సాంబశివరావు సంస్థ ట్రాన్స్ ట్రాయ్ ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోవడంతో పోలవరం పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అంతేకాదు... రుణాలిచ్చిన బ్యాంకులు రాయపాటి ఆస్తులనూ జప్తు చేస్తున్నాయి.

అప్పట్లో ట్రాన్స్ ట్రాయ్ కు ఎలాంటి అర్హత లేదని మిగతా సంస్థలు మొత్తుకున్నా కూడా ఆ సంస్థకే పోలవరం కాంట్రాక్టు ఇచ్చారు. అయితే... పనుల కోసం ఆంధ్ర బ్యాంకు నుంచి 433 కోట్ల రుణం తీసుకున్నారు రాయపాటి. ఇది ట్రాన్సు ట్రాయ్ పేరుతో తీసుకున్నారు. కానీ... ఇప్పుడు ఈఎంఐ లు కూడా కట్టలేకపోతున్నారట.

10 నెలలుగా అప్పులు కట్టకపోవడంతో హైదరాబాద్ లో ఉన్న ట్రాన్స్ ట్రాయ్ ఆఫీసును బ్యాంకు స్వాధీనం చేసుకుంది. అంతేకాదు.. ఈఏడాది జనవరిలోనే గుంటూరులోని ఆయన ఇంటిని, పలు స్థలాలను ఆంధ్ర బ్యాంకు స్వాధీనం చేసుకుంది. రాయపాటి కాంగ్రెస్ హయాంలో రోడ్లు - ఇరిగేషన్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు భారీగా చేజిక్కించుకున్నారు. ఇప్పుడు అప్పులు కట్టలేక తిప్పలు పడుతన్నారంటున్నారు.

కాగా రుణాలు ఎగ్గొడితే మాల్యాలాగా తమ రుణాలను కూడా రైట్ ఆఫ్ చేస్తారన్న ఉద్దేశంతోనూ కావాలనే కట్టడం లేదన్న అభిప్రాయమూ తాజా పరిణామాల నేపథ్యంలో వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News