ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయపోరాటం..ఎన్నికల వాయిదాపై సుప్రీం - హైకోర్టుకు
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆకస్మికంగా ఎన్నికలను వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయం సరికాదని పేర్కొంటూ.. ఆ నిర్ణయం ఉప సంహరించుకుని యథావిధగా ఎన్నికలు నిర్వహించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరుతున్నారు. ఎన్నికలు ప్రకటించిన ప్రకారం జరగాలనే పట్టుదలతో ఎన్ని ప్రయత్నాలు చేయాల్నో అన్ని రీతిల జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో గవర్నర్ కు - ఎన్నికల సంఘం కమిషనర్ కు లేఖ రాపించారు. దీనిపై గవర్నర్ ను కూడా కలిసి విన్నవించారు. ఇక న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని కోరుతూ హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టులోను పిటిషన్లు వేయించారు.
నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాయిదా వేసే అధికారం ఎన్నికల సంఘానికి లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. నెల్లూరుకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషన్ ను స్వీకరించిన న్యాయస్థానం.. లంచ్ విరామం అనంతరం విచారణ చేపడతామని తెలిపింది. కాగా ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని కోరుతూ గతంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా.. మార్చి 31లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం కమిషనర్ తీసుకున్న ఉద్దేశపూర్వక నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను యథావిధిగా కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సోమవారం పిటిషన్ వేసింది. ఎన్నికలను వాయిదా వేస్తూ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులు సరికాదని - వాటిని కొట్టివేయాలని పిటిషన్ లో కోరారు. ఎన్నికల సంఘం కమిషనర్ రమేశ్ కుమార్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించింది. ఈ పిటిషన్ పై న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది. కేసుల విచారణ జాబితాలో దీన్ని చేర్చాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ను జస్టిస్ లలిత్ ఆదేశించారని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అంశంపై ఆంధఫ్రదేశ్ ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఈనెల 31వ తేదీలోగా ముగించకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.5 వేల కోట్లకు రావని ఈ సందర్భంగా హైకోర్టు - సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లలో పేర్కొన్నారు. ఆ నిధులు ఆగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.