ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులు...మారుమూల శ్రీకాకుళం జిల్లాలోని బాధితులు వీరంతా. జనసేన పార్టీ అధ్యక్షుడు - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పర్యటించే వరకు ఎవరూ పట్టించుకోలేదు. పవన్ బాధితులను పరామర్శించిన తర్వాత ఏపీ ప్రభుత్వం హుటాహుటిన స్పందించింది. ఉద్దానం ప్రాంత కిడ్నీ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆచరణలోకి వచ్చే సరికి కంటి తుడుపు చర్యలతో సరిపెడుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చి ఏకంగా నెలరోజులు అవుతున్నా చిన్న ఆదేశం సైతం ఆచరణ రూపం దాల్చకపోవడం ఆశ్చర్యకరమని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో జనవరి ఆరున శ్రీకాకుళం జిల్లా రాజాం పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబునాయుడు కిడ్నీ బాధితులకు పలు హామీలు గుప్పించారు. కిడ్నీ వ్యాధి గ్రస్తుల సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొంటూ విశాఖపట్నం కేజీహెచ్ కు వెళ్లేందుకు ఉచిత బస్సు పాసులు జారీ చేస్తామని ప్రకటించారు. 25 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఇందుకు సంబంధించి ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. వ్యాధి తీవ్రంగా ఉన్న వారికి మాత్రమే డయాలసిస్ అవసరముంటుంది. వ్యాధిని తొలి దశలోనే గుర్తించి చికిత్స అందించేందుకు నెఫ్రాలజిస్టులు శ్రీకాకుళం జిల్లాలో లేరు. దీంతో రోగులు వ్యయప్రయాసల కోర్చి విశాఖ వెళ్తున్నారు. బస్సు పాస్ ఇస్తే ప్రయాణ ఖర్చుల భారం తగ్గుతుందని కిడ్నీ రోగులు అంటున్నారు. మరోవైపు కిడ్నీ బాధితులకు పింఛను అందజేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ హామీలో కూడా కదలిక కనిపించడం లేదు. కనీసం మార్గదర్శకాలైనా వెలువరించకపోవడం గమనార్హం. ఇక ఆరోగ్య కోణంలో మరో చిత్రమైన అడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. నిబంధనలను పక్కన పెట్టిన ప్రభుత్వం ప్రయివేట్ సంస్థలు - కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే పనులు చేస్తోందని విమర్శించారు. జిల్లాలో పలాస - సోంపేటల్లో పబ్లిక్ - ప్రయివేట్ పార్టనర్ షిప్ (పిపిపి) పద్ధతిలో డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. ఇవి రెండు నెలల్లో ప్రారంభం కానున్నట్లు అధికారులు చెప్తున్నారు. జిల్లాలో ఇప్పటికే మూడు చోట్ల పీపీపీలో డయాలసిస్ కేంద్రాలు నడుస్తున్నాయి. శ్రీకాకుళం నగరంలోని రిమ్స్‌లో బి-బ్రాన్ అనే ప్రయివేట్ సంస్థ భాగస్వామ్యంతో డయాలసిస్ యూనిట్ నడుస్తోంది. పాలకొండ - టెక్కలిలోని డయాలసిస్ యూనిట్లను నెఫ్రో ప్లస్ సంస్థ నిర్వహిస్తోంది. ఇందుకు ఒక్కొక్క డయాలిసిస్ కు గానూ ఆయా సంస్థలకు ప్రభుత్వం రూ.968 చొప్పున చెల్లిస్తున్నారు. ఉద్దానం ప్రాంతంలోని 252 గ్రామాలకు రూ.15 కోట్లతో శుద్ధ జలం పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా ప్రయివేట్ సంస్థల నుంచి టెండర్లు పిలవడానికి సిద్ధమవుతోంది. శుద్ధ జలం కంటే మినరల్ వాటర్ అందించడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని వైద్యులు అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/