విజయవాడలోనే రిపబ్లిక్ డే వేడుకలు... సీఎం వ్యూహం ఇదే !

Update: 2020-01-21 06:54 GMT
ఏపీకి మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్‌ వేగంగా అడుగులు వేస్తూ ముందుకువెళ్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో దీనికి సంబంధిచిన బిల్లు ఆమోదం లభించింది. ప్రస్తుతం ఈ బిల్లు శాసన మండలి ముందుకు  వెళ్లింది. మరోవైపు - విశాఖ నుంచి ఈ నెలలోనే  పరిపాలన  ప్రారంభించాలని వైసీపీ సర్కార్ వేగంగా పావులు కదుపుతుంది. అందులో భాగంగా జనవరి 26న రిపబ్లిక్ డేను వైజాగ్‌ లోనే నిర్వహించేందుకు ముందుగా సిద్ధమైంది.  దీనికి సంబంధించిన రిహార్సల్‌ కూడా విశాఖలో  కొనసాగుతున్నాయి.

కానీ , తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సారికి విజయవాడలోనే రిపబ్లిక్ డే నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ ఏడాది  రిపబ్లిక్ డే వేడుకలు విజయవాడ మున్సిపల్ స్టేడియంలోనే నిర్వహించనున్నారు. జనవరి 26న వైజాగ్ ఆర్కే బీచ్ లో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని తొలుత జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ , విజయవాడలో రిపబ్లిక్ డే నిర్వహించడం వల్ల అక్కడ ప్రజల్లో ఉన్న అభద్రతాభావాన్ని తొలగించాలనే యోచనలో సర్కార్  ఉన్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే విశాఖ ఆర్కే బీచ్‌లో ఈ మేరకు చేస్తున్న ఏర్పాట్లను నిలిపేయాలని ఏపీ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో విజయవాడలో గణతంత్ర దినోత్సవం నిర్వహించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు.
Tags:    

Similar News