తెలంగాణ పోలీసులు పట్టుకున్న విదేశీ మద్యం కేసులో ఏపీ మంత్రి ఒకరు ఇన్వాల్వ్ అవుతుండడం చర్చనీయమవుతోంది. విదేశీ మద్యం స్మగ్లింగ్ చేస్తున్న ఒక అధికారిని తెలంగాణ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే... దీంతో ఆయన్ను విడిచిపెట్టాలంటూ విశాఖ జిల్లాకు చెందిన ఒక మంత్రి పోలీసులకు ఫోన్ చేశారట. తెలంగాణ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కు నేరుగా ఆ ఏపీ మంత్రి ఫోన్ చేసి పట్టుబడిన అధికారి తనకు బాగా కావాల్సిన వ్యక్తి అని వెంటనే వదిలేయాలని సూచించారట... దానికి సబర్వాల్ నో చెప్పారని టాక్.
కాగా అకున్ సభర్వాల్ గతంలో విశాఖ కమిషనర్ గా పనిచేయడంతో ఆ ఏపీ మంత్రికి ఆయనతో పరిచయం ఉంది. దాన్ని అడ్డంపెట్టుకుని ఆయన ఈ ట్రయల్ వేశారు. కానీ.... పక్కా ఆధారాలతో సదరు అధికారి దొరికిపోయారని కాబట్టి వదిలిపెట్టే ప్రసక్తే లేదని అకున్ స్పష్టం చేశారట.
కాగా మద్యంతో పట్టుబడిన అధికారి సదరు మంత్రిగారికి కూడా విదేశీ మద్యం సరఫరా చేస్తుంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే తన గుట్టు బయటకు రాకుండా ఉండేందుకు మంత్రి లాబీయింగ్‌కు దిగారని టాక్. సబర్వాల్ అంగీకరించకపోవడంతో తెలంగాణలోని తనకు తెలిసిన ప్రముఖుల ద్వారా ఫోన్ల మీద ఫోన్లు చేయించారట ఆ మంత్రి. టీడీపీ మహానాడు నేపథ్యంలో సదరు అధికారి ద్వారా మంత్రిగారే భారీగా విదేశీ మద్యం తెప్పించారన్న ప్రచారం కూడా టీవీ ఛానళ్లలో జరుగుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/