పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు నాయుడు.. గతంలో జరిగిన తప్పులేవీ ఈసారి జరగకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే.. తరచూ సర్వేలు నిర్వహిస్తూ.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు.. ఎమ్మెల్యేలు.. మంత్రుల పని తీరు మీద ఎప్పటికప్పుడు నివేదికలు సిద్ధం చేయిస్తున్నట్లు చెబుతున్నారు.
తాజాగా.. ఏపీలోని ఎమ్మెల్యేలందరికి సంబంధించిన ఒకసర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. మంత్రుల కంటే కూడా.. ఎమ్మెల్యేలే చురుగ్గా పని చేస్తున్నట్లు తాజా సర్వే తేలటం తెలిసిందే. ప్రభుత్వ పథకాల మీద ఫీడ్ బ్యాక్ తోపాటు.. మంత్రులు.. ఎమ్మెల్యేల పని తీరుకు సంబంధించి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
మంత్రుల పని తీరు ఏమాత్రం బాగోలేదని.. వారి కంటే పలువురు ఎమ్మెల్యేలు చురుగ్గా పని చేస్తున్నట్లుగా తాజా నివేదికలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో కొందరి మీద వేటు వేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. మంత్రులపై వేటు వేయటం ద్వారా.. పని చేసిన వారికే పదవులన్న సందేశాన్ని చెప్పకనే చెప్పినట్లు అవుతుందన్న భావనలో బాబు ఉన్నట్లు చెబుతున్నారు. తాజా వచ్చిన సర్వే రిపోర్ట్ లో పని తీరులో బాగా వెనుకబడిన నలుగురు మంత్రులకు మూడు నెలల సమయం ఇచ్చారని.. మూడు నెలల వ్యవధిలో వారి పని తీరు మారకపోతే.. వారిని పదవుల నుంచి తొలగిస్తానన్న విషయాన్ని బాబు వారికి స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. చూస్తుంటే.. ఏపీ మంత్రుల్లో కొందరికి మూడిందన్న మాట బలంగా వినిపిస్తోంది.