ఏపీలో ఎన్నికలకు ముందర చంద్రబాబు దాదాపు 3వేల కోట్లను ఎస్బీఐ నుంచి అప్పుగా తీసుకొని ఖర్చు పెట్టేశాడు. దీంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి అప్పు పుట్టని పరిస్థితి నెలకొంది. ఏపీ ఆర్థిక వ్యవహారాలు ఇప్పుడు తలకు మించిన భారంగా మారాయన్న అంచనాలు నెలకొన్నాయి.
* జీతాలకే సరిపోతాయా?
ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందా? ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందా? ఈనెల 1వ తేదీన జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం ఆపసోపాలు పడుతుందా అంటే ఔననే అంటున్నాయి ఆర్థిక శాఖ వర్గాలు.. ప్రస్తుతం బ్యాంకులు - ఆర్బీఐ - ఇతర బాండ్ల వేలం ద్వారా అప్పు పుడితేనే ప్రభుత్వ ఉద్యోగులకు - రిటైర్డ్ ఉద్యోగులకు వేతనాలు - పెన్షన్లు చెల్లించే పరిస్థితి ఉందట..
*ఏపీకి వచ్చే నెల ఆదాయం 10వేల కోట్లు
ప్రస్తుతం ఏపీ రాష్ట్రానికి సగటున నెలకు 10,000 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఇందులో కేంద్రం నుంచి వచ్చే పన్నుల్లో వాటా - వివిధ పథకాలకు - ప్రాజెక్టులకు గ్రాంట్లు రూ.5వేల కోట్ల వరకు ఉంటాయి. మరో 5వేల కోట్లు రాష్ట్రానికి సొంతంగా వచ్చే ఆదాయం.
*ఏపీ నెలసరి ఖర్చు 9400 కోట్లపైనే
ఈ పదివేల కోట్లను ప్రధానంగా మూడింటేకే తొలుత ఖర్చు చేస్తారు. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు - పెన్షన్లకు 5400 కోట్లు - సంక్షేమ పెన్షన్లకు రూ.1000 కోట్లు - లోన్లు - వడ్డీలకు 2500 కోట్లు చెల్లిస్తారు. ఈ మొత్తమే 8900 కోట్లుగా ఉంది.
*మిగిలేదీ ఆరేడు వందల కోట్లేనా?
మిగిలిన 1100 కోట్లలో ప్రతీనెల విద్యుత్ ఎల్ వోసీ కోసం రూ.500 కోట్లు చెల్లించాలి. అంటే కేవలం ఆరేడువందల కోట్లు మాత్రమే ఏపీకి మిగులుతాయి. దీంతో వైఎస్ జగన్ హామీనిచ్చిన నవరత్నాల హామీలు ఈ ఆరేడు వందల కోట్లతో సాధ్యమయ్యే పని కాదు.. దీని కోసం బ్యాంకులు , ఆర్బీఐ వద్ద అప్పులు చేయాల్సిన దుస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందని ఆర్థిక శాఖ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏపీ ఆర్థిక సంక్షోభాన్ని ఎలా గట్టెక్కించాలో తెలియక ఆపసోపాలు పడుతున్నారట..