హుదూద్ తుపాను విలయం నుంచి విశాఖ ప్రజలు పూర్తిగా తేరుకోలేదు. ఇంకా మానని గాయాలు కనిపిస్తూనే ఉన్నాయి. నష్టాల నుంచి ప్రజలు బయట పడలేక పోతున్నారు. తుపాను సమయంలో ఎందరో వారికి సహాయం ప్రకటించారు... కానీ, అందులో అందింది కొంతే.... సంస్థలు, వ్యక్తులు ప్రకటించినది ఇవ్వకపోతే ఏమో అనుకోవచ్చు.... ప్రజాప్రతినిధులూ వారిని మోసం చేశారు. ముఖ్యంగా ఏపీ రాజ్యసభ సభ్యులు హుద్ హుద్ బాధితులకు ఇస్తామని ప్రకటించిన సహాయాన్ని ఏడాదైనా ఇంతవరకు ఇవ్వలేదట.
హుద్ హుద్ తుపాను కారణంగా ఉత్తరాంధ్ర వణికిపోయింది... సీఎం చంద్రబాబు స్వయంగా 8 రోజులు అక్కడే ఉండి సహాయ చర్యలను పర్యవేక్షించారు. ఏపీకి చెందిన లోక్ సభ సభ్యులు రూ.12 కోట్లు సహాయం ప్రకటించారు. రాజ్యసభ సభ్యులు రూ.3 కోట్లు సహాయం చేస్తామని చెప్పారు. లోక్ సభ ఎంపీలు చెప్పినట్లుగానే రూ.12 కోట్లను బాధితుల సహాయార్థం ఖర్చు చేశారు... కానీ, రాజ్యసభ ఎంపీలు మాత్రం ఆ ఊసే మర్చిపోయారు. విశాఖ లేదు... తుపాను లేదు... సహాయం లేదు... మొత్తం మర్చిపోయారు.
కేంద్రం కూడా ప్రకటించిన మేర నిధులు ఇవ్వలేదు... చాలావరకు కోత పెట్టింది... రాజ్యసభ సభ్యులు కూడా అప్పటికి మొసలి కన్నీరు కార్చినా తరువాత హుద్ హుద్ బాధితులను మర్చిపోవడం... వారికి చేస్తానన్న సహాయం ఊసే ఎత్తకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.