ఎంసెట్ పరీక్ష రాయటానికి ఏపీ విద్యార్థులకు కొత్త కష్టం వచ్చి పడింది. విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు వేర్వేరుగా ఎంసెట్ పరీక్షను నిర్వహిస్తున్న నేపథ్యంలో సీమాంధ్ర విద్యార్థులు తెలంగాణ నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్షకు హాజరవుతున్నారు.
సీమాంధ్రతో పోలిస్తే.. హైదరాబాద్.. చుట్టుపక్కల ఉన్న ఇంజినీరింగ్.. మెడిసిన్ కాలేజీలు మెరుగైన వసతులు.. మౌలిక సదుపాయాలు ఉండటంతో తెలంగాణ ఎంసెట్ రాసేందుకు పెద్దఎత్తున సీమాంధ్ర విద్యార్థులు సిద్ధం అవుతున్నారు.
ఈ నేపథ్యంలో వేలాదిగా ఉన్న ఏపీ విద్యార్థులు ఎంసెట్ పరీక్ష కోసం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పరిస్థితి. ఇది ఇబ్బందికరంగా ఉంటుందని.. తెలంగాణ ఎంసెట్‌ను ఏపీలో కూడా నిర్వహించాలని ఏపీ సర్కారు కోరింది.
ఈ అంశాన్ని పరిశీలించిన తెలంగాణ విద్యాశాఖ.. ఏపీలో ఎగ్జామ్ నిర్వహించటం సాధ్యం కాదని తేల్చేసింది. ఆలస్యంగా సమాచారం అందించటం.. పరీక్ష నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నేపథ్యంలో ఏపీలో తెలంగాణ ఎంసెట్ నిర్వహించటం సాధ్యం కాదని చెప్పింది. ఏదోలా తెలంగాణ ఎంసెట్ ఏపీలో నిర్వహిస్తారని ఆశ పడ్డ వేలాది విద్యార్థులు.. పరీక్ష కోసం పక్క రాష్ట్రానికి పయనం కావాల్సిన పరిస్థితి ఏర్పడినట్లే.