తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టుకు నిర్మాణ దశలోనే ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు - పలు రాష్ర్టాలకు చెందిన అతిథుల నుంచి కితాబు దక్కించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు దేశ విదేశీ ప్రతినిధులు సైతం అబ్బురపడుతుండటం విశేషం. బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తాజాగా యునెస్కో ఆధ్వర్యంలో చేపడుతున్న పథకంతో కాళేశ్వరం ప్రాజెక్టును పోల్చారు.విదేశాల్లో ఉన్న ప్రాజెక్టుల స్థాయిలో సేవలు అందిస్తాయని ఆకాంక్షించారు.
ప్రఖ్యాత యునెస్కో ఆధ్వర్యంలో బాలి దేశంలో సుబక్ వాటర్ ఇరిగేషన్ సిస్టం పేరుతో అక్కడి రైతులకు సాగునీరు సేవలు అందుతున్నాయి. ఇవి అద్భుతమైన ఫలితాలను అందించాయి. తాజాగా ఆ దేశాన్ని సందర్శించిన ఆండ్రూ ఇటీవలి తన కాళేశ్వరం పర్యటనను గుర్తుచేసుకున్నారు. `బాలిలో యునెస్కో ఆధ్వర్యంలో చేపడుతున్న పథకాల ద్వారా ఎలాంటి చక్కని ఫలితాలు అందుతున్నాయో.. అదేరీతిలో తెలంగాణలో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ తో కూడా అలాంటి అద్భుతమైన ఫలితాలు అందుతాయి` అని ఓ ట్వీట్ లో పేర్కొన్నారు. దీనికి మంత్రి కేటీఆర్ మరో ట్వీట్ లో స్పందిస్తూ `ఆండ్రూ మీరు కాళేశ్వరాన్ని సందర్శించినందుకు సంతోషం. ఆ ప్రాజెక్టు ప్రత్యేకతను మీరు గుర్తించినందుకు చాలా ఆనందదాయకంగా ఉంది` అని కృతజ్ఞతలు తెలిపారు. వెరసి కాళేశ్వరం పూర్తి అయ్యేందుకు ముందే...పలువురి ప్రశంసలు పొందుతోందని టీఆర్ ఎస్ వర్గాలు ఖుష్ అవుతున్నాయి.
ఇదిలాఉండగా...సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఉపశమనం దక్కిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్ట్టు పనులను నిలిపివేయాలనే అభ్యర్థనను కొట్టిపారేసింది. పర్యావరణ - అటవీశాఖ అనుమతులు వచ్చేవరకు రిజర్వ్ ఫారెస్ట్‌లో కాళేశ్వరం ప్రాజెక్ట్టు పనులు మినహా ఇతర పనుల కొనసాగింపునకు అనుమతిస్తూ ఉమ్మడి హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషనర్ హయతుద్దీన్ దాఖలుచేసిన స్పెషల్ లీవ్ అప్పీల్ పిటిషన్ ను శుక్రవారం జస్టిస్ రోహింటన్ ఫాలి నారిమన్ - జస్టిస్ నవీన్ సిన్హా నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది.