చంద్రబాబుకు ఉద్యమాల సెగ తప్పేలా లేదు. ఇప్పటికే ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం కారణంగా నెలకోసారి తలనొప్పి తెచ్చుకుంటున్న చంద్రబాబు నెత్తిన ఈసారి ఇంకా పెద్ద బండ పడేలా ఉంది. కేంద్ర ప్రభుత్వాలనే తన ఉద్యమాలతో మూడు చెరువుల నీరు తాగించిన అన్నా హజారే కూడా ఏపీలో ఉద్యమాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇంకా ఏమీ నిర్ధారణ కాకపోయినా హజారే అమరావతికి త్వరలో రావడం మాత్రం ఖాయమని తెలుస్తోంది.
ఏపీ రాజధాని నిర్మాణం.. దానివల్ల వ్యవసాయానికి నష్టం... పర్యావరణానికి కలిగే నష్టంపై ఎన్నో వివాదాలు, కేసులు ఉన్నాయి. తాజాగా అమరావతి ప్రాంతంలో నిపుణుల బృందం పర్యటించింది. రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందంటూ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పోరాటం చేస్తున్న బొల్లిశెట్టి సత్యనారాయణ విజ్ఞప్తి మేరకు సుప్రీం కోర్టులోని ప్రముఖ న్యాయవాది సంజయ్ పారిక్, ప్రొఫెసర్ విక్రం సోనిలతో కూడిన నిపుణుల బృందం రెండు రోజులపాటు 29 గ్రామాల్లో విస్రృతంగా పర్యటించింది. రాజధాని ప్రాంతంలో తీరుతెన్నులను చూసి సుప్రీం కోర్టు న్యాయవాది సంజయ్ పారిక్ విస్మయం వ్యక్తం చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఇప్పటి వరకు ప్రభుత్వం వినిపించిన వాదనలన్నీ అబద్దమని తమ పర్యటనలో తేటతెల్లమైందని చెప్పారు.
ప్రభుత్వ న్యాయవాది తన వాదనల్లో లంక గ్రామాల్లో ప్రజలు నివసించడం లేదంటూ చెప్పారని కానీ ఇక్కడ లంక గ్రామాల్లో గిరిజనులు, దళితులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నట్టు తమ పర్యటన ద్వారా తెలుసుకున్నామన్నారు. ఏటా మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం స్వాధీనం చేసుకోవడంతో దళితులు, గిరిజనులు ఉపాధి కోల్పోయారని ఆవేదన చెందారు. ప్రజల కష్టాలన్నీ వీడియోలు తీసి ట్రిబ్యునల్ ముందు ఉంచడానికి ఏర్పాట్లు చేశారు ఆ న్యాయవాదులు. మలిదశలో అన్నా హజారేను కూడా తేనున్నట్లు చెప్పారు. దీంతో అమరావతి నిర్మాణంపై జాతీయ స్థాయి ఉద్యమకారులు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. సుప్రీం న్యాయవాదులు, అన్నా హజారే దీనిపై పూర్తిగా దృష్టి పెడితే చంద్రబాబుకు బేజారే