యూపీలో ప్రభుత్వముందా..ముగ్గురు మైనర్ బాలికలపై యాసిడ్ దాడితో ఆగ్రహ జ్వాలలు

Update: 2020-10-13 14:30 GMT
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో 20 ఏళ్ల దళిత యువతిని నలుగురు యువకులు దారుణంగా హతమార్చిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటూ.. దుండగులను కఠినంగా శిక్షించాలంటూ ఊరు వాడ ఏకమై నినదిస్తున్నారు. రోడ్ల పైకి చేరి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా.. ఎటువంటి చర్యలు లేవని..అసలు ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు అత్యాచారాలకు అడ్డుకట్ట పడాలని విద్యార్థులు, యువత, మేధావులు, ప్రజాసంఘాలు ఒక్కటై నినదిస్తుంటే మరోవైపు మాత్రం ఉత్తరప్రదేశ్లో మానవ మృగాలకు ఇవేమీ పట్టడం లేదు. వారి కిరాతక కాండకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.

సోమవారం రాత్రి ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాలో నిద్రిస్తున్న ముగ్గురు దళిత వర్గానికి చెందిన అక్కాచెల్లెలపై అర్ధరాత్రి ఓ దుండగుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. దాడికి గురైన బాలికల వయస్సు వరుసగా 8, 12, 17 ఏళ్లు మాత్రమే. దుండగుడి దాడిలో ఇద్దరు బాలికలకు కాలిన గాయాలు కాగా.. మరో బాలిక ముఖంపై యాసిడ్ పడింది. తీవ్ర కాలిన గాయాలైన ఈ ముగ్గురిని
చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి గోండా పోలీసులు ఇప్పటి వరకు ఎవరినీ ఇంకా అదుపులోకి తీసుకోలేదు. దర్యాప్తు సాగిస్తున్నారు. హత్రాస్ లో హ త్యాచార సంఘటన యూపీలో యోగి ప్రభుత్వాన్ని కుదిపే స్తుండగా మరోసారి దారుణ సంఘటన జరగడంతో ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం ఆందోళనతో అట్టుడుకుతోంది. దళిత సమాజంపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలకు నిరసనగా దళిత సంఘాలు ఏకమై నిందితులను శిక్షించాలని ఆందోళనలు చేపట్టాయి.


Tags:    

Similar News