పేరు ప్రఖ్యాతులు కాస్త తక్కువే కానీ.. మాంచి ట్రాక్ రికార్డు ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటి ''ఐడీబీఐ''. తొలుత పరిశ్రమలకు రుణాలు ఇచ్చే ఈ బ్యాంక్.. తర్వాతి కాలంలో బ్యాంకింగ్ సేవల్ని నిర్వహిస్తోంది. ఇటీవల కాలంలో ఇంటి రుణాలకు సంబంధించి ఈ బ్యాంకు కాస్తంత దూకుడుగానే వ్యవహరిస్తోంది.
ఇలాంటివేళ.. ఈ బ్యాంక్ ను ప్రైవేటైజేషన్ చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. అంతేకాదు.. తాజాగా ఆ డీల్ కు సంబంధించిన వివరాల్ని వెల్లడించింది. ఇటీవల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థల్ని ఒక్కొక్కటిగా అమ్మేస్తూ.. సొమ్ము చేసుకుంటున్న మోడీ సర్కారు.. తాజాగా ఐడీబీఐ వాటాను విక్రయించేందుకు సిద్ధమైంది.
కేంద్ర ప్రభుత్వంతో పాటు.. మరో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ ఐసీతో కలిపి మొత్తం 60.72 శాతం వాటాను అమ్మేందుకు రెఢీ అయ్యింది. ఆసక్తి ఉన్న వారు బిడ్ లు వేసుకోవటానికి ఆహ్వానం పలికారు. ఇందుకు డిసెంబరు 16 వరకు గడువు పెట్టారు. ఐడీబీఐలో ఎల్ఐసీకి 49.24 శాతం వాటా ఉండగా.. కేంద్ర ప్రభుత్వానికి 45.48 శాతం వాటా ఉంది. అంటే.. ఈ రెండింటికి కలిపి 94.72 వాటా ఉన్నట్లు.
ప్రైవేటైజేషన్ లో భాగంగా ప్రభుత్వం తన వాటాలో 30.48 శాతం (అంటే దాదాపు 70 శాతం వరకు) ఎల్ ఐసీకి ఉన్న వాటాలో 30.24 శాతం (అంటే.. దగ్గర దగ్గర 60 శాతం) వాటాను అమ్మేందుకు సిద్ధమయ్యాయి. వాటాలు మాత్రమే కాదు బ్యాంకులో యాజమాన్య నియంత్రణను సైతం బదిలీ చేసేందుకు బిడ్స్ కు ఆహ్వానం పలికారు. డీల్ అనంతరం సంయుక్త వాటా 34 శాతానికి పరిమితం కానుంది. అయితే.. ఈ డీల్ ఓకే కావాలంటే బోలెడన్ని నిబంధనల్ని పెట్టారు.
అందులో ముఖ్యమైనది భారీ పారిశ్రామిక.. కార్పొరేట్ హౌస్ లు.. వ్యక్తులను బిడ్డింగ్ కు అనుమతించరు. బిడ్ లో పాల్గొనే కంపెనీ కనీసం రూ.22,500 కోట్ల నెట్ వర్త్ ను కలిగి ఉండాలి. గడిచిన ఐదేళ్లలో మూడేళ్ల పాటు లాభాల్ని ఆర్జించిన కంపెనీకి మాత్రమే బిడ్డింగ్ అర్హత లభిస్తుంది. కన్సార్టియం ఏర్పాటైతే నాలుగు కంపెనీలకు మించి ఉండకూడదు.
బిడ్డర్ కనీసం ఐదేళ్ల పాటు బ్యాంకులో 40 శాతం వాటాను తప్పనిసరిగా లాకిన్ చేయాలి. తాజా నిర్ణయంతో ఐడీబీఐ బ్యాంక్ షేర్ కాసింత లాభపడింది. ప్రస్తుతం పలుకుతున్న ధర నేపథ్యంలో 60.72 శాతం వాటాకు రూ.27,800 కోట్లు లభించే వీలుంది. మరి.. ఈ బిడ్ కు ఆసక్తి చూపే వారెవరో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.