ఎల్లో ఫంగస్ .. బ్లాక్- వైట్ ఫంగస్ కంటే డేంజర్ !?

Update: 2021-05-24 10:30 GMT
దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ఇదే సమయంలో బ్లాక్ ఫంగస్ వెలుగులోకి వచ్చిన మరింత ఆందోళనకి గురిచేసింది. కరోనా పోకమునుపే ఈ బ్లాక్ ఫంగస్ విజృంభణ తారా స్థాయికి చేరుకుంటుంది. ఆ తర్వాత దేశంలో వైట్ ఫంగస్ కూడా వెలుగులోకి వచ్చింది. ఈ కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా రకరకాల ఫంగస్ లు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఎల్లో ఫంగస్ ఇప్పుడు గుబులు పుట్టిస్తోంది. అసలు ఈ ఎల్లో ఫంగస్ అంటే ఏంటి.. ఇది ఎంత  ప్రమాదకరం అనే విషయాలని ఒకసారి గమనిస్తే ..

దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్న సమయంలో  మరో కొత్త ఫంగస్ జాబితాలో చేరిపోయింది. అదే ఎల్లో ఫంగస్. ఎల్లో ఫంగస్‌ కు సంబంధించిన తొలికేసు ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఇది బ్లాక్ ఫంగస్ మరియు వైట్ ఫంగస్‌ ల కంటే ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఎల్లో ఫంగస్ సోకిస వ్యక్తికి ప్రముఖ ఈఎన్‌ టీ స్పెషలిస్టు నేతృత్వంలో చికిత్స  అందిస్తున్నారు. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్‌ ల కంటే ఈ ఎల్లో ఫంగస్ మరింత  ప్రమాదకరం అని నిపుణులు చెప్తున్నారు. ఈ ఫంగస్ సోకితే ..  మనిషిలో బద్దకం ఎక్కువగా ఉండటం, నిదుర మత్తు కలిగి ఉండటం, ఆకలి కాకపోవడం, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు.

ఎల్లో ఫంగస్ మరింత తీవ్రంగా మారిందంటే మనిషిలో మరిన్ని మార్పులు కనిపిస్తాయని చెబుతున్నారు. అంటే నిత్యం చీము కారడం, ఒకవేళ ఏమైనా గాయాలుంటే ఆ గాయాలు మానకపోవడం, గాయాలు మానేందుకు చాలా రోజుల సమయం పట్టడం, ఒంట్లో భాగాలు పనిచేయకపోవడం, కళ్లు లోపలికి పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స ప్రారంభించాలని లేదంటే ప్రాణాలకే ముప్పువాటిల్లే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఎల్లో ఫంగస్‌కు యాంఫోటెరిసిన్-బీ ఇంజెక్షన్ మాత్రమే విరుగుడని చెప్పారు. ఎల్లో ఫంగస్ అనే వ్యాధి రావడానికి ప్రధాన కారణం పరిసరాలు శుభ్రంగా లేకపోవడమే అని నిపుణులు చెబుతున్నారు. . ఇంటిలో తేమ శాతం కూడా చూసుకుంటూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉంటే బ్యాక్టీరియా మరియు ఫంగస్‌ లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుంటాయని చెప్పారు.
Tags:    

Similar News