అదానీ ఖాతాలోకి మరో ప్రాజెక్ట్

Update: 2021-03-25 05:04 GMT
ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వ హయాంలో గుజరాత్ కు చెందిన పారిశ్రామికవేత్త గౌతం అదానీకీ దేశంలో కాంట్రాక్టులు వెల్లువెత్తుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే చాలా ప్రాజెక్టులను చేజిక్కించుకున్న అదానీ సంస్థ తాజాగా మరో ప్రాజెక్టును తన ఖాతాలో వేసుకుంది.

తెలంగాణలో రూ.1039.90 కోట్ల విలువైన జాతీయ రహదారి నిర్మాణ కాంట్రాక్టును అదానీ సంస్థ దక్కించుకుంది. భారత్ మాలా పరియోజన పథకంలో భాగంగా కోదాడ-ఖమ్మం మధ్య ఎన్.హెచ్ 365ఏ రహదారిని 4 వరుసలుగా నిర్మించే కాంట్రాక్టును ఈ కంపెనీ సొంతం చేసుకుంది.

రెండేళ్లలో రోడ్డు పూర్తి చేసి 15 ఏళ్ల పాటు నిర్వహణ చూసుకుంటుంది. ఈ కాంట్రాక్టుతో 6 రాష్ట్రాల్లో అదానీ గ్రూపు చేతిలో ఉన్న జాతీయ రహదారి రోడ్డు ప్రాజెక్టులు ఎనిమిదికి చేరాయి.

కేంద్రంలోని మోడీ సర్కార్ ఉండడంతో ఆయన సొంత రాష్ట్రానికి చెందిన అదానీకి కాంట్రాక్టులు వెల్లువెత్తుతున్నాయన్న విమర్శ వ్యక్తమవుతోంది. ఇటీవలే ఆయన సంపద ప్రపంచ కుబేరురులు బెజోస్, ఎలన్ మస్క్ లను మించి వృద్ది చెందడం కూడా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. 
Tags:    

Similar News