హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో యాంటిజెన్ టెస్ట్ చాలా కాస్ట్లీగా మారింది. దేశీయ, విదేశీ ప్రయాణం చేసేందుకు కరోనా నెగెటివ్ రిపోర్టు అవసరం. బయట రూ.వందల ఖరీదు చేసే ఆ పరీక్ష విమానాశ్రయంలో ఏకంగా రూ.5వేలకు దగ్గరగా ఉండడం గమనార్హం. ఫ్లైట్ ఎక్కడానికి 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకొని.. కొవిడ్ నెగెటివ్ గా నిర్ధారణ అయితేనే ప్రయాణం చేయాలి. అయితే కొన్ని కారణాల వల్ల విమానాశ్రయంలోనూ పరీక్ష చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఓ ప్రైవేటు సంస్థ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. అందుకు ఏకంగా రూ.4,500 ఫీజు తీసుకుంటున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. కరోనా లేదనే ధ్రువపత్రం తప్పనిసరి కాబట్టి అడిగినంత ఇచ్చి పరీక్ష చేయించుకుంటున్నామని అంటున్నారు.
కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టడం దృష్ట్యా దేశ,విదేశీ ప్రయాణాల సంఖ్య పెరిగింది. అమెరికా వంటి దేశాలతో ఆంక్షలతో భారతీయులను అనుమతిస్తోంది. ఫలితంగా దాదాపు ఏడాదిన్నర కాలం నుంచి ఎదురు చూస్తున్న ప్రయాణికులు తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సినవారు తదుపరి పరిస్థితి ఎలా ఉంటుందోనని ఇప్పటినుంచే వెళ్లిపోతున్నారు. ఇక ఇదే అదునుగా చేసుకొని యాంటిజెన్ పరీక్షల కోసం అధిక ఫీజులను హైదరాబాద్ ఎయిర్ పోర్టులో వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ప్రస్తుతం వివిధ దేశాలకు వెళ్లేందుకు ఇక్కడి నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవని... తాము గమ్యస్థానానికి చేరుకునేలోపు దాదాపు నాలుగు, ఐదు సార్లు పరీక్ష చేయించుకోవాల్సి వస్తోందని వాపోయారు. కరోనా పేరిట దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొవిడ్ నిబంధనలు సడలించినా ఎయిర్ లైన్స్ సేవలు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. గతంలో చేసుకున్న ఎయిర్ బబుల్స్ ఒప్పందం ప్రకారం తక్కువ సంఖ్యలోనే విమానాలు తిరుగుతున్నాయి. అమెరికా, యూరప్ వంటి దేశాలకు ప్రయాణికులు పెరుగుతున్నారు. ఇక అరబ్ దేశాలు దుబాయ్, దోహా, షార్జా వంటి దేశాలకు కూడా ఎక్కువ మంది వెళ్తున్నట్లు సమాచారం. ఇటీవలె ఆంక్షలు సడలించిన వేళ ఎయిర్ లైన్ సంస్థలు టికెట్ ధరలను అమాంతం పెంచేశాయి. కాగా ఓవైపు టికెట్ ధరలు మరోవైపు పరీక్షల పేరిట వేల రూపాయలను దోచుకుంటున్నారని ఓ ప్రయాణికుడు అన్నారు. ప్రజల అవసరాన్ని అదునుగా ఉపయోగించుకోకూడదని పేర్కొన్నారు. వందల రూపాయల్లో ఖర్చు అయ్యే పరీక్షకు దాదాపు రూ.5వేలు తీసుకోవడం అన్యాయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విమాన టికెట్ల ధరలు, కరోనా పరీక్షల ఫీజులు ఎలా ఉన్నా కూడా రోజురోజుకూ విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అక్టోబర్ లో దాదాపు లక్ష మంది విమాన ప్రయాణాలు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. కాగా ప్రస్తుతం 1.6 లక్షల మంది దాకా వివిధ దేశాలను రాకపోకలు సాగించినట్లు సమాచారం. ఇకపోతే దేశీయ ప్రయాణీకుల సంఖ్య సైతం పెరగడం గమనార్హం. దేశంలోని ప్రధాన నగరాలకు రాకపోకలు పెరిగాయి. దేశీయ ప్రయాణీకుల సంఖ్య 9.5 లక్షల నుంచి ప్రస్తుతం పది లక్షలు చేరినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే మరో రెండు నెలల వరకు కొవిడ్ ఆంక్షలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత వివిధ దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలావరకు పూర్తవుతుందని... నెమ్మదిగా ఆంక్షలు సడలించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. భారత్ లోనూ టీకా పంపిణీ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది.