బ్రేకింగ్: కరోనాతో బీజేపీ మాజీ మంత్రి మణిక్యాల రావు కన్నుమూత

Update: 2020-08-01 13:30 GMT
ఏపీలో కరోనా ధాటికి ఓ బిగ్ షాట్ కన్నుమూశారు. బీజేపీ మాజీ మంత్రి మణిక్యాల రావు కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయసు 60 సంవత్సరాలు..

మాణిక్యాల రావుకు గత నెలలోనే కరోనా సోకింది. ఆయన నెలరోజులుగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమించి చనిపోవడం తీవ్ర విషాదం నింపింది.

ఏపీలో ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉన్నతాధికారులకు కరోనా సోకినా ఎవరికీ ప్రాణాపాయం సంభవించలేదు. కానీ ఏకంగా ఓ మాజీ మంత్రి, బీజేపీ నేత కరోనాతో మృతి చెందడం రాజకీయ వర్గాల్లో విషాదం నింపింది.
Tags:    

Similar News