పొత్తు కావాలంటే.. మా కండిష‌న్లకు ఒప్పుకోవాల్సిందే: ఏపీ బీజేపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2022-06-05 09:34 GMT
ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తుల విష‌యం ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్‌గా సాగుతోంది. ముఖ్యంగా జ‌న‌సేన‌-టీడీపీ పొత్తు పెట్టుకుంటున్నాయ‌నే వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. అయితే.. ప్ర‌స్తుతం బీజేపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకుంది. కానీ, టీడీపీతో క‌లిసి ముందుకు సాగేందుకు మాత్రం బీజేపీ నేత‌లు .. స‌సేమిరా అం  టున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో బీజేపీని ఒప్పించే బాద్య‌త‌ను తానుతీసుకుంటాన‌ని.. వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీల‌నివ్వ‌న‌ని.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెబుతున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో ఏం జ‌రిగిందో ఏమో.. తాజాగా.. బీజేపీ నేత‌లు పొత్త రాజ‌కీయంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశా రు. ఎవరినో ముఖ్యమంత్రి చెయ్యడానికి బీజేపీ కూటమి సిద్దంగా లేదని ఏపీ బీజేపీప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. అతేకాదు.. త‌మ‌తో కలిసి అధికారంలోకి రావాలంటే ఇతర పార్టీలు త్యాగాలు చెయ్యడానికి సిద్ధం కావాలని సూచించారు. ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారని, ఇది వాస్త‌వ‌మేన‌ని చెప్పారు.

రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఒక‌సారి టీడీపీకి 2019లో  వైసీపీకి ప్రజలు అధికారం ఇచ్చారని విష్ణు చెప్పారు. ఇప్పుడు బీజేపీ జనసేన మిత్ర ప‌క్షానికి ప్రజలు ఛాన్స్ ఇవ్వలని భావిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్న బీజేపీ కేంద్ర నాయకత్యం ఏపీపైనా ఫోకస్ పెట్టిందన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా బీజేపీ కూట‌మి పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని విష్ణు జోస్యం చెప్పారు.

బీజేపీ, జనసేన తో మిగతా పార్టీలు కల‌వాలంటే బీజేపీ జాతీయ నాయకత్వం దగ్గరకు వచ్చి మాట్లాడాల‌ని విష్ణు సూచించారు. బీజేపీ నేత‌లు ఎవ్వరి దగ్గరకు వెళ్ళే పరిస్థితి లేదని, ఎవ‌రిని పొత్తు పెట్టుకోమ‌ని కోర‌బో మ‌ని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచనలు ఇతర పార్టీలు పాటించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ నీ గద్దె దించుతామ‌ని శ‌ప‌థం చేశారు. బీజేపీ, జనసేన మ‌ధ్య ఉన్న రాజకీయ బంధం ఫెవికాల్ కన్నా బలమైన బందమ‌ని విష్ణు వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News