రాళ్లు విసిరారు.. గొడ్డళ్లతో దాడి చేశారు

Update: 2015-04-10 11:30 GMT
శేషాచల అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై ఏపీ డీజీపీ హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. దీని ప్రకారం.. శేషాచల అడవుల్లో ఎర్రచందనం దుంగల్ని దోచుకోవటానికి వచ్చిన వారేమీ అమాయకులు కాదని.. వారి స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు.. అటవీశాఖ అధికారులపై దాడులు చేశారని పేర్కొన్నారు.

రాళ్లతోనూ.. గొడ్డళ్లతోనూ వారు దాడికి దిగినట్లు నివేదికలోపేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీలు కూడా తమ వద్ద ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఆత్మరక్షణలో భాగంగానే తమ సిబ్బంది.. స్మగ్లర్లుపై కాల్పులు జరపాల్సి వచ్చిందని డీజీపీ పేర్కొన్నారు. మరోవైపు.. ఈ ఘటనకు నిరసన వ్యక్తం చేస్తూ.. నాలుగో రోజు కూడా తమిళనాడులో ఆందోళనలు భారీగా సాగుతున్నాయి.

Tags:    

Similar News