నో.. డౌట్ 10 ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కు చాన్స్‌.. అప్పుల‌పై ఏపీ దూకుడు

Update: 2022-07-21 07:38 GMT
ఏపీ అప్పుల విష‌యంలో ఏం జ‌రుగుతోంది?. ఊరూ వాడా.. పెద్ద ఎత్తున వైసీపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు వ‌స్తు న్నాయి.  రాష్ట్రాల విష‌యంలో కేంద్రం తాజాగా వెల్ల‌డించిన ప్రెజెంటేష‌న్‌.. ఏపీకి శ‌రాఘాత‌మేనని.. మ‌రో శ్రీలంక అవుతుంద‌ని.. ప్ర‌తిప‌క్షాలు స‌హా కేంద్రం కూడా హెచ్చ‌రించింది. అయితే.. దీనిని అనుస‌రించి.. ఏపీ ఒక దిశానిర్దేశం ఏర్పాటు చేసుకుని.. అప్పుల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు.

అంతేకాదు.. ఆత్మ ప‌రిశీల‌న చేసుకుని.. పాల‌న‌ను మెరుగు ప‌రుచుకుంటుంద ని కూడా భావించారు.  అయితే.. ఏపీ ప్ర‌భుత్వం ఈ దిశ‌గా అడుగులు వేస్తున్న ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అంతేకాదు.. ఆత్మ పరిశీల‌న కూడా ఎక్క‌డా క‌నిపించ‌డంలేదు.

తాజాగా వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు.. అధిష్టానానికి అత్యంత ద‌గ్గ‌ర‌గా ఉండే.. నాయ‌కుల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌లు.. వాటిపై పార్టీలో కీల‌క నేత‌లు  చేస్తున్న వ్యాఖ్య లు వంటివి ఆస‌క్తిగా మారింది. వ‌చ్చే రెండేళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉండ‌నుంది.

మ‌రోవైపు..అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ప‌ర‌మావ‌ధి. సో.. ఈ నేప‌థ్యంలో ఎక్క‌డా వెర‌వాల్సిన అవ‌స‌రం లే దు.. అనే త‌ర‌హాలోనే వైసీపీ అధిష్టానం ఉంద‌ని తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారడం తో.. గెలుపు గుర్రం ఎక్కేందుకు.. ఇప్పుడున్న సంక్షేమాన్ని సంపూర్ణంగా అమ‌లు చేయాల‌ని, అవ‌స‌ర‌మై తే.. మ‌రిన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకొని పోవాల‌ని.. కూడా దృఢ నిశ్చ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

అంతేకా దు.. ''అప్పులు చేయ‌కుండా... బీజేపీ ప్ర‌భుత్వాలు కూడా లేవు. ఇదంతా కేంద్ర ప్ర‌భుత్వం ఆడుతున్న హంబ‌క్ రాజ‌కీయం'' అని కీల‌క నాయ‌కుడు ఒక‌రు ఆఫ్ దిరి కార్డుగా మీడియాతో వ్యాఖ్యానించారు.

మ‌రొక నాయ‌కుడు.. ''ఏపీలో అమ‌లు చేస్తున్న సంక్షేమం వేరు. ఇప్పుడు.. రాష్ట్రంలో ప‌రిస్థితి అదుపులో ఉంది. కాబ‌ట్టి.. సంక్షేమం కోసం ఖ‌ర్చు చేసే సొమ్మును అప్పులుగా చూడ‌లేం.. చూపించ‌లేం. స‌హ‌జంగా నే అన్ని రాష్ట్రాలు క‌రోనా స‌మ‌యంలోఅప్పులు చేశాయి. ఇప్పుడు కొత్త‌కాదు.. ఇక‌పై ముగిసిపోదు. కేవలం కేంద్రం చేస్తున్న ఒక దుష్ప్రచారం మాత్ర‌మే'' అని నెల్లూరు జిల్లాకు చెందిన అత్యంత కీల‌క‌మైన నాయ‌కుడు.. కూడా వ్యాఖ్యానించారు. సో.. ఈ ప‌రిణామాల‌ను బ‌ట్టి.. ఏపీ ప్ర‌భుత్వం అప్పులపై ముందుకే వెళ్లేలా ఉంద‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News