అగ్రిగోల్డ్ బాధితులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిధులను జమ చేసింది. రు. 10 నుండి రు. 20 వేల మధ్య పెట్టుబడి పెట్టిన వాళ్లకు తాజాగా వాళ్ళ డబ్బులు అందచేసింది. సుమారు 10.40 లక్షల మంది ఖాతాదారులకు రు. 670 కోట్లను ప్రభుత్వం జమచేసింది. ఇంతకుముందు కూడా అంటే 2019 నవంబర్లోనే రు. 10 వేల కట్టిన సుమారు 3.5 లక్షల మందికి డబ్బులు అందచేసిన విషయం తెలిసిందే. తాజా లెక్కలతో కాలిపి దాదాపు 14 లక్షల మంది ఖాతాదారులకు ప్రభుత్వం డబ్బులు అందచేసినట్లయ్యింది. దీన్ని టీడీపీ నేతలు అసలు తట్టుకోలేకపోతున్నారు.
ఆగ్రిగోల్డ్ సంస్ధకున్న భూములు వేలం వేసి తిరిగి రాబట్టుకుంటామని ఒకవైపు జగన్ చెబుతునే మరోవైపు ఉదారంగా ఆదుకున్నామని నాటకాలు ఆడటం ఏమిటంటూ అచ్చెన్నాయుడు అండ్ కో తెగబాధపడిపోతున్నారు. కోర్టులో కేసు తేలిన తర్వాతే ఆస్తులు అమ్మి ఖాతాదారులకు డబ్బులు జమచేస్తామని జగన్ అంటే ఖాతాదారులు ఏమి చేయగలరు ? అంటే ఖాతాదారుల సమస్యను అర్థం చేసుకున్నారు కాబట్టే ముందు డబ్బులు జమచేసేసి తర్వాత ఆస్తులను అమ్మి తమ సొమ్మును ప్రభుత్వం రీఎంబర్స్ చేసుకుంటుందని జగన్ చెప్పిందాంట్లో తప్పేముంది.
అసలు కుంభకోణం జరిగిందే టీడీపీ అధికారంలో ఉన్నపుడు. ఇపుడు జగన్ చేసిన పనే అప్పుడు చంద్రబాబునాయుడు ఎందుకు చేయలేదు. బాధితులు నానా గోల చేసిన తర్వాత సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు అంటే ఫిబ్రవరిలో బాధితులను ఆదుకునే పేరుతో ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఎన్నికలకు ముందు జీవో ఇవ్వడం, ఎన్నికల కోడ్ పేరుతో డబ్బులు పంపిణీ చేయలేకపోయామని ఇపుడు చెప్పడం ఎవరిని మోసం చేయడానికి? ఆ చేసేదేదో ముందే ఎందుకు చేయలేదని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు.
అందుకనే అగ్రిగోల్డ్ ఆస్తుల మీద తప్ప బాధితుల మీద టీడీపీ పెద్దల దృష్టి లేదని వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. 2019లో మొదటి విడత నిధులు చెల్లించిన తర్వాత రెండో విడతకు కరోనా వైరస్ సమస్య అడ్డంకిగా మారిందని అధికార పార్టీ నేతలంటున్నారు. ఏదేమైనా ఇంతకాలానికైనా తమ డబ్బులు అందినందుకు బాధితులు సంతోషిస్తుంటే మధ్యలో టీడీపీ బాధేమిటో అర్థం కావటంలేదు.