ఏపీ సచివాలయం గా ఆంధ్ర యూనివర్సిటీ !

Update: 2019-12-28 10:12 GMT
ఏపీ లో రాజధాని వ్యవహారం రచ్చ రచ్చగా మారి పోయింది. సీఎం జగన్ ఏపీ కి మూడు రాజధానులు అంటూ ప్రకటన చేయడంతో అమరావతి ప్రాంత ప్రజలు , రైతులు కొందరు రాజధాని ని అమరావతి నుండి తరలించకండి అంటూ ధర్నాలు , ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వీరికి కొన్ని పార్టీల నేతలు మద్దతు గా నిలుస్తున్నారు. ఇక రాజధాని పై నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ అనంతరం ఒక స్పష్టమైన ప్రకటన వెలువడుతుంది అని అందరూ భావించారు. కానీ , ప్రభుత్వం మాత్రం మరో కమిటీ నివేదిక వచ్చిన తరువాత దాన్ని కూడా పరిశీలించిన తరువాత జనవరి 3 న రాజధాని పై ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తుంది.

ఇకపోతే , ఎగ్జిక్యూటివ్ రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నం కు మార్చాలనే నిర్ణయాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రస్తుతానికి వాయిదా వేసింది కానీ , తెర వెనుక దానికి కావాల్సిన అన్ని పనులని కూడా సిద్ధం చేస్తునట్టు తెలుస్తుంది. ప్రభుత్వ అధికారులు ఇప్పటికే పోర్ట్ సిటీ నుండి పరిపాలనను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ రహదారి పై మడ్డిలపాలెం జంక్షన్ వైపు ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క ఉత్తర బ్లాకులను సెక్రటేరియట్ కాంప్లెక్స్ కోసం, ఇతర అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ల కోసం అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆంద్రా యూనివర్సిటీని పరిశీలించిన ప్రభుత్వ వర్గాలు అక్కడ సచ్చివాలయం ఏర్పాటుకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయని గుర్తించారు.

ఆంధ్ర యూనివర్శిటీ లో ఇంజనీరింగ్ కాలేజ్ విభాగానికి చెందిన అనేక భవనాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే 1500 మందికి వసతి సముదాయం కల్పించే పెద్ద హాల్ కూడా ఉంది. అలాగే వాహనాల పార్కింగ్ కోసం కావాల్సిన అనువైన ప్రదేశం కూడా ఉండటం తో అక్కడే సచ్చివాలయాన్ని ఏర్పాటు చేయాలనీ అనుకుంటున్నారు. అలాగే ఆంధ్రా యూనివర్సిటీ బీచ్ రోడ్డు కి  అతి దగ్గరలో ఉండటంతో .. సీఎం క్యాంప్ ఆఫీస్ కి కూడా అదే రూట్లో ఏర్పాటు చేయాలనీ చూస్తున్న సమయం లో ఆంధ్రా యూనివర్సిటీ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది.


Tags:    

Similar News