నేను ముఖ్యమంత్రి ని కాదు : పవన్ కళ్యాణ్

Update: 2015-10-17 07:23 GMT
జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీ హీరో పవన్‌ కల్యాణ్‌ ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వస్తారా..? రారా? అనే ప్రశ్న అందరి మనసులనూ తొలిచేస్తోంది. తాజాగా ఏపీ మంత్రులు ఆయనకు అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానం అందించిన సందర్భంగా పవన్ మాట్లాడారు. హైదరాబాద్‌ లోని రామానాయుడు స్టూడియోలో షూటింగ్‌ లో ఉన్న ఆయనను ఏపీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, కామినేని శ్రీనివాస్‌ లు కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. "సర్దార్ గబ్బర్ సింగ్" చిత్రం షూటింగ్ అక్కడ జరుగుతుండగా మంత్రులు వెళ్లి పవన్ ను కలిశారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి హైదరాబాద్ లా కాకూడదని ఆశిస్తున్నానని చెప్పాడు. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టారని, నూతన రాజధానిలో అందరూ సంతోషంగా ఉండాలన్నదే తన కోరిక అని... తనకు శంకుస్థాపన  కార్యక్రమానికి వెళ్లాలని ఉందని.. అయితే, గుజరాత్ లో ఈలోగా షూటింగు ఉండడంతో వెళ్తున్నానని చెప్పారు. తన షూటింగ్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని చెప్పారు... రావాలనే ఉందని చెప్పారు.

కాగా చంద్రబాబు నాయుడు గారు రాజదాని కోసం మీ సూచనలు కూడా తీసుకుంటాను అన్నారు మీ సూచనలు అవసరం కదా అని మీడియా అనగా తాను సలహాలు ఇచ్చేంతటి వాడిని కానని ఆయన నవ్వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి పిలవలేదన్న ప్రస్తావన రాగా పవన్ దాన్ని కొట్టి పారేశారు. ప్రొటోకాల్ ప్రకారం ఆయన తన వద్దకు రావడం సరికాదని అన్నారు ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రి ని పిలవడం కరెక్ట్ .. ప్రోటోకాల్ ప్రకారం నన్ను పిలవడానికి ఆయన రావడం కరెక్ట్ కాదు అన్నట్టు చెప్పారు . పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ప్రభుత్వానికి కావాలని మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్ ఈ సందర్భంగా అనడం విశేషం. మంత్రివర్గం ఏర్పాటైనప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారని వారు గుర్తు చేస్తూ శంకు స్థాపనకూ రావాలని కోరుకున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ తో ఫోన్‌ లో మాట్లాడుతారని వారు చెప్పారు.

ఇంతకీ పవన్ వస్తున్నట్లా రానట్టా?
Tags:    

Similar News