విభ‌జ‌న చ‌ట్టాన్ని కెలికేసిన ఏపీ.. సుప్రీంలో పిటిష‌న్‌!

Update: 2023-01-09 12:30 GMT
ఏపీలో విస్త‌రించాల‌ని చూస్తున్న బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ముంద‌రి కాళ్ల‌కు ఏపీ వైసీపీ స‌ర్కారు బంధం వేసేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎటూ తేల్చ‌కుండా.. తేల్చ‌డానికి కూడా ఇష్ట‌ప‌డని విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల పై తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కార్న‌ర్ చేస్తూ.. వైసీపీ ప్ర‌భుత్వం సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది.

రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి.. 8 ఏళ్లు పూర్తయిపోయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు వాటిపై ప‌ట్టించుకోలేద‌ని.. తెలంగాణ స‌ర్కారు వీటిని తేల్చేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదని విమ‌ర్శ‌లు ఉన్న విష‌యం తెలిసిందే.

ఖ‌చ్చితంగా ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టు ను ఆశ్ర‌యించ‌డం.. బీఆర్ ఎస్ అదినేత‌, కేసీఆర్‌ను ఇర‌కాటంలోకి నెట్టేసింది. ఏపీ పిటిష‌న్‌లో ఏం పేర్కొందంటే..

ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థలను.. తక్షణమే విభజించాలని సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. దీనిలో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చింది. ఈ పిటిష‌న్‌పై విచారించిన సుప్రీంకోర్టు కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనలో తీవ్ర ఆలస్యం అవుతున్నాయ‌ని ఏపీ పేర్కొంది.

ఈ షెడ్యూల్‌లో ఉన్న సంస్థల విలువ దాదాపు రూ.1,42,601 కోట్లుగా ఉంద‌ని పేర్కొంది. తెలంగాణలో దాదాపు 91 శాతం సంస్థలున్నాయని, లక్ష మందికిపైగా ఉద్యోగులు అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నారని, ఈ సంస్థల విభజన ఆలస్యం వల్ల ఏపీ నష్టపోతోంద‌ని పిటిష‌న్‌లో వైసీపీ ప్ర‌భుత్వం పేర్కొంది.

విభజన అంశంలో తెలంగాణ స్పందించకపోవడాన్ని కూడా ప్ర‌స్తావించింది. ఏపీ ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేన‌ని స‌ర్కారు తెలిపింది. తక్షణమే సంస్థల విభజనకు  ఆదేశాలివ్వాలని సుప్రీంను ఏపీ  ప్రభుత్వం అభ్య‌ర్థించింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News