ఓపక్క కరోనా.. మరోవైపు పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదు అవుతూ.. ఏపీ రాష్ట్రంలో చిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రజలంతా వైరస్ భయాందోళనలో ఉన్నారు. ఇలాంటివేళ.. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి జగన్ సర్కారు ఆమోదించి పంపిన బిల్లును ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. తాజాగా తీసుకున్న నిర్ణయంపై అధికారపక్షం నేతలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. విపక్ష నేతలు తప్పు పడుతున్నారు.
తీవ్ర సంచలనంగా మారిన ఈ నిర్ణయం వెనుక ఏం జరిగింది? బిల్లు ఆమోదం..సింఫుల్ గా రాజముద్రను రబ్బర్ స్టాంప్ మాదిరి వేసేశారా?లాంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ పెడితే.. కొత్త విషయాలెన్నో బయటకు వస్తాయి. తన వద్దకు వచ్చిన మూడు రాజధానుల బిల్లును గవర్నర్ చాలా క్షుణ్ణంగా పరిశీలించినట్లుగా తెలుస్తోంది.
అంతేకాదు.. ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించొద్దని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు.. నాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా.. అమరావతి రైతులు గవర్నర్ కు లేఖలు రాశారు. వారు రాసిన లేఖల్ని జాగ్రత్తగా పరిశీలించటంతో పాటు.. రూల్ బుక్ లో వినతులకు ఉన్న స్థానం ఏమిటన్నది మదింపు చేయటంతోపాటు.. నిబంధనలకు లోబడే బిల్లు ఉందా? లేదా? అందులో ఏమైనా లోపాలు ఉన్నాయా? అన్న విషయాన్ని న్యాయ సలహాల్ని స్వీకరించిన తర్వాతే ఆమోదముద్ర వేసినట్లు చెబుతున్నారు. దాదాపు రెండు వారాల నుంచి నిర్ణయం తీసుకునేందుకు వీలుగా కసరత్తు చేస్తున్నారు. తాను సంప్రదించిన అన్నిచోట్ల నుంచి సానుకూలంగా సమాచారం రావటంతో బిల్లుకు ఆమోదముద్ర వేశారు.
బిల్లుకు ఆమోదముద్ర వేసే సమయంలో బిల్లులోని అంశాల్ని అధ్యయనం చేయటంతో పాటు.. మండలిలో చోటు చేసుకున్న పరిణామాలు.. రూల్ పొజిషన్ అన్ని అంశాల్ని పక్కాగా పరిశీలించిన తర్వాత మాత్రమే మూడు రాజధానుల బిల్లుపై ఆమోద ముద్ర వేసినట్లుగా తెలుస్తోంది. సంతకం పెట్టటానికి ముందు ఢిల్లీకి చెందిన ప్రముఖు న్యాయకోవిదులతోనూ బిల్లుపై చర్చలు జరిపారు. ఈ బిల్లు న్యాయసమీక్షకు లోబడి ఉన్నాయా? లేదా? అన్న విషయాల్ని చర్చించి.. చివరకు అందరి సలహాలు.. సూచనలతోనే ఆమోదముద్ర వేశారు. దీంతో విశాఖలో కార్యనిర్వాహఖ రాజధాని.. కర్నూలులో న్యాయ రాజధాని.. అమరావతిలో శాసన రాజధానిగా మారనుంది.