‘వరి ఒక సోమరిపోతు వ్యవసాయం’ అంటూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, అన్నదాతలు క్షమించాలని ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథ రాజు అభ్యర్థించారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో జరిగిన కృషి విజ్ఞానకేంద్రం రజతోత్సవంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరి అనేది ఓ సోమరిపోతు వ్యవసాయం అని అన్నారు. అధికారులు గేట్లు ఎత్తితే కాల్వల ద్వారా నీళ్లు వస్తాయి.. డబ్బులిస్తే భూమి దున్నిపోతారు.. రైతులు కష్టపడాల్సిన పనిలేదు అంటూ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమయ్యాయి. రైతుల శ్రమను చిన్నచూపు చూసేవిధంగా మాట్లాడడం సరికాదని, మంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. దీంతో.. జరిగిన పొరపాటును గుర్తించిన మంత్రి.. నష్టనివారణ చర్యలు చేపట్టారు.
తాను రైతు బిడ్డను కావడంతో ఆ విధంగా తొందరపడి మాట్లాడానని, ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు కౌలు రైతులకు అందట్లేదన్న మంత్రి.. భూ యజమానులు మాత్రమే అనుభవిస్తున్నారని అన్నారు.