చింతకాయల అయ్యన్నపాత్రుడు... టీడీపీలో తొలి తరం నేతగానే కాకుండా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి కంటే కూడా సీనియర్ కిందే లెక్క. అంతేనా... ప్రభుత్వం తమదైనా, ఇతర పార్టీలదైనా... అవినీతి జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేని మనస్తత్వం ఆయనది. సొంత పార్టీ నేత, సొంత జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావుపైనే సంచలన ఆరోఫణలు చేసిన అయ్యన్న.... తనలోని నిజాయతీని అయితే నిరూపించుకున్నారు గానీ.. పార్టీ పరువును బజారున పడేశారన్న వాదన వినిపిస్తోంది. పార్టీలో సీనియర్ మోస్ట్‌గానే కాకుండా ఆరోపణలకు ఆమడంత దూరం ఉండే నేతగా పేరున్నా... మహిళా డ్యాన్సర్లతో కలిసి చిందులేసిన అయ్యన్న ఆ డ్యాన్సర్ల జాకెట్లకు కరెన్సీ నోట్లను స్వయంగా అంటించేసి తీవ్ర విమర్శల్లో చిక్కుకుపోయారు. ప్రస్తుతం అయ్యన్న డ్యాన్సులు, మహిళా డ్యాన్సర్లపై నోట్ల వెదజల్లిన తీరుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
ఈ వీడియో చూస్తే... ఇలాంటి వ్యక్తులా మన మంత్రులుగా ఉన్నది అన్న భావన వ్యక్తమవుతోంది. ఇక అయ్యన్న చిందులేసిన ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే... విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో మహిళా డ్యాన్సర్లతో చిందులేసిన అయ్యన్న స్ట్రీట్ డ్యాన్స్ లో ఇరగదీశారని చెప్పాలి. అదిరేటి స్టెప్పులతోనే ఆగని అయ్యన్న డ్యాన్సర్లపై డబ్బులు కూడా విసిరారు. డప్పు దరువుకు అనుగుణంగా లయబద్దంగా ఆయన... మహిళా డ్యాన్సర్ల జాకెట్లకు స్వయంగా కరెన్సీ నోట్లను అంటించేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తాను ఓ ప్రజా ప్రతినిధిని, మంత్రిని అన్న విషయాన్నే మరిచిన అయ్యన్న నిజంగానే డప్పు దరువుకు అనుగుణంగా స్టెప్పులేసి స్ట్రీట్ డ్యాన్సుల్లో తనను మించిన వారే లేరని నిరూపించుకున్నారన్న విశ్లేషణలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి.
అసలే ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఓ వైపు వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసిన ఆమరణ దీక్షలకు దిగి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినా మొక్కవోని సంకల్పంతో దీక్షలు కొనసాగిస్తుంటే... బాధ్యత కలిగిన ఓ మంత్రిగా అయ్యన్న మాత్రం ఇలా వీధుల్లోకి దిగి స్టెప్పులతో ఇరగదీయడమే కాకుండా మహిళా డ్యాన్సర్ల జాకెట్లకు నోట్ల ను అంటించేసిన వైనం జనానికి బాగానే ఆగ్రహం తెప్పించక మానదన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా ఇప్పటిదాకా క్లీన్ ఇమేజీ ఉన్న నేతగా పేరున్న అయ్యన్న... ఇలా డ్యాన్సులేసి తన పరువుతో పాటు పార్టీ పరువును కూడా బజారున పడేశారన్న వాదన వినిపిస్తోంది.
వీడియో ని చూడటానికి క్లిక్ చేయండి
Full View