కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పాదం మోపుతున్న సందర్భమో ఏమో కానీ ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు మొదలయ్యాయి. ఇందులో ఒకటి పాత డిమాండే కాగా మరోటి కొత్త డిమాండ్.
ఏపీకి అమరావతే ఏకైక రాజధానిగా చేయాలనుకుంటే తమ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేయాలని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల ఉద్దేశమంతా ఏపీ రాజకీయాలు, ఏపీ రాజధానులకు సంబంధించినదిగానే కనిపిస్తున్నా దాని వెనుక రాజకీయంగా అంతకంటే పెద్ద ఆలోచనలు ఉన్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు తన ఉత్తరాంధ్ర పర్యటన సమయంలో తాము అధికారంలోకి వస్తే అమరావతినే ఏపీకి ఏకైక రాజధానిగా కొనసాగిస్తామని చెప్పడంతో వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
కాగా ధర్మాన ఈ వ్యాఖ్యలను రెండో రోజూ కొనసాగించడంతో రాయలసీమకు చెందిన సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి స్పందించారు. ప్రత్యేక రాష్ట్రం చేయాల్సింది ఉత్తరాంధ్రను కాదని.. రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బైరెడ్డి గతంలోనూ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్లు, ఉద్యమాలు చేశారు.
తాజాగా ఆయన వైసీపీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు కౌంటర్‌గా ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు... ఉత్తరాంధ్ర రాజధాని కోసం రాజీనామా చేయాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. మంత్రి ధర్మానకు చిత్తశుద్ధి ఉంటే ముందుగా ఆ పని చేయాలన్నారు. గతంలో విశాఖ ఉక్కు కోసం రాయలసీమ వాసులు ప్రాణత్యాగాలు చేశారని బైరెడ్డి గుర్తుచేశారు. రాయలసీమ వాసులు ప్రాణ త్యాగాలు చేయకపోతే విశాఖకు స్టీల్ ప్లాంట్ వచ్చేదా అని ఆయన ప్రశ్నించారు. ఆ విషయాన్ని మంత్రి ధర్మాన గుర్తుంచుకోవాలని బైరెడ్డి సూచించారు.
ఇదంతా ఎలా ఉన్నా ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలు వెనుక బీఆర్ఎస్ కోణమూ వినిపిస్తోంది. వెలమ కులానికి చెందిన కేసీఆర్ తన బీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా విస్తరించే క్రమంలో ఏపీలో ఇప్పటికే ఆఫీసు ఏర్పాట్లలో పడ్డారు. ఆయన తన బీఆర్ఎస్ పార్టీని ఏపీలో విస్తరిస్తే తన కులానికి చెందిన నేతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తారన్న ప్రచారం ముందునుంచీ ఉంది. వెలమ కులం ఎక్కువగా ఉత్తరాంధ్రలో ఉంది.
ధర్మాన ప్రసాదరావు కూడా అదే కులానికి చెందిన నేత. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సుదీర్ఘ కాలం సాగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన తన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి ఏపీలోనూ అడుగుపెడుతుండడంతో ఉత్తరాంధ్ర వెలమ నేత ధర్మాన ప్రసాదరావు ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్ర వాదన ఎత్తుకోవడం యాదృచ్ఛికం కాదని... ఇది చంద్రబాబుకు మాత్రమే హెచ్చరిక కాదని.. సొంత పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్‌కు కూడా హెచ్చరిక అన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.