సోషల్ మీడియాలో దొంగల బెడద రోజురోజుకి ఎక్కువ అవుతుంది. ఆన్ లైన్ యూజర్లను బోల్తా కొట్టించడం సైబర్ నేరగాళ్లకు సరదాగా మారుతోంది. ముఖ్యంగా ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తూ వికృత అనందం పొందుతున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ట్విటర్ అకౌట్ హ్యాకింగ్‌కు గురికావడం కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ట్విట్టర్ ఖాతా లో కొందరు హ్యాకర్లు అశ్లీల చిత్రాలను పోస్ట్ చేయడం కలకలం రేపింది. తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది అనే విషయాన్ని మంత్రి మేకపాటి ఆలస్యంగా గుర్తించారు.
తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని తెలుసుకున్న వెంటనే ఆయన దీని పై ట్విట్టర్ సంస్థ తో పాటు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాలను వివరిస్తూ ఆయన ట్వీట్ చేశారు. తన ట్విట్టర్ ఖాతాలో అశ్లీల చిత్రాలు కనపడినందుకు తన ఫాలోవర్లకు క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఆయన ట్విట్టర్ ఖాతాలో వచ్చిన అశ్లీల చిత్రాలను సిబ్బంది తొలగించారు.దీనిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఎవరు గౌతమ్ రెడ్డి ట్విట్టర్ హ్యాక్ చేసి ఉంటారు. ఎక్కడ నుంచి హ్యాక్ అయింది అనే విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనిపై త్వరలోనే అన్ని విషయాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.