పొలిటికల్ మైలేజీ కోసమే.. కేసీఆర్ కామెంట్లు.. ఏపీ మంత్రి కన్నబాబు ఆగ్రహం.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ఈ రోజు మాట్లాడుతూ.. ఏపీపై తీవ్ర విమర్శలే చేశా రు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యకు ఏపీనే కారణమని అన్నారు. విబజన సమస్యలపై ఏపీ అతి తెలివి ప్రదర్శించి.. తెలంగాణను ఇబ్బంది పెడుతోందన్నారు.
అన్ని సమస్యలను కూడా ఏపీ వల్లే పరిష్కారం చేసుకోలేక పోతున్నామని.. కేసీఆర్ అసెంబ్లీ వేదికగానే ఏపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకా దు, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూల్స్‌లో పేర్కొన్న రాష్ట్రాల ఉమ్మడి ఆస్తుల విభజనకు సంబంధించి ఏపీ ప్రభుత్వం విచక్షణారహితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
అయితే.. కేసీఆర్ వ్యాఖ్యలు, ఏపీ అన్యాయం చేసిందనే విషయాలపై ఏపీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. పొలిటికల్ మైలేజ్ కోసమే కేసీఆర్ ఏపీపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ తీవ్రస్థాయిలో నష్టపోవడానికి చంద్రబాబు, కేసీఆర్‌లు ఇద్దరూ కారకులని వ్యాఖ్యా నించారు. విభజన జరిగి 8 ఏళ్లు గడుస్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెల్లించాల్సిన రూ.5 వేల కోట్ల విద్యుత్ బకాయిలను ఇంతవరకు చెల్లించలేదని, కేంద్రం జోక్యం చేసుకుని విభజన సమస్యలను పరిష్కరించాలని కన్నబాబు సూచించారు.
నోటుకు ఓటు కేసులో ఇరికిస్తారేమోనన్న భయంతో మాజీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు తెలంగాణను వదులుకుని అర్థరాత్రి ఏపీకి వెళ్లిపోయారు, దీంతో అవశేష రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లిందని అన్నారు.
ఏపీ వల్ల సమస్యలను చూపించి.. తాను లబ్ధి పొందాలని కేసీఆర్ చూస్తున్నారని, అయితే ఎవరు అలా ప్రవర్తిస్తారో ప్రజలకు తెలుసన్నారు. లెక్కలు తేల్చకపోగా హైదరాబాద్‌లో మిగిలిపోయిన ఉమ్మడి ఆస్తుల వివాదాలను తెలంగాణ ఇప్పటికీ తేల్చలేదని.. అన్నారు.
ఇప్పటి వరకు ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కారం కాలేదని గుర్తు చేశారు.వివాదాస్పద అంశాలపై టీఆర్ఎస్, వైసీపీ రెండు ప్రభుత్వాల అధికారులు కూర్చొని చర్చలు జరపాల్సి ఉన్నా ఇంతవరకు జరగలేదన్నారు. పదేళ్లపాటు హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోనే ఉండి ఉంటే, సమస్యలు పరిష్కారం అయ్యేవని కన్నబాబు అన్నారు.
కానీ, చంద్రబాబు నాయుడు నోటుకు ఓటు కేసులో న్యాయపరమైన ఇబ్బందులకు భయపడి, ఆయన అన్నీ వదిలేసి ఏపీకి పారిపోయి వచ్చేశారని విరుచుకుపడ్డారు.
తెలంగాణ నుంచి పారిపోయిన చంద్రబాబు నాయుడును రాజకీయంగా కేసీఆర్ సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరగాలని, అప్పుడే ఆస్తులను ఇరు రాష్ట్రాల మధ్య పంచుకోవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే చెబుతున్నారని మంత్రి కురసాల తెలిపారు.