నిజ‌మే బూతులు మాట్లాడే నాయ‌కులు అవ‌స‌ర‌మా?! : జ‌నం టాక్‌!!

Update: 2022-10-20 14:30 GMT
తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వ‌స్తున్నాయి. ``ఔను స‌ర్‌.. బూతులు మాట్లాడే నాయ‌కులు అవ‌స‌ర‌మా?`` అని ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు స‌పోర్టు చేస్తున్నారు. ఇంత‌కీ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే... దారుణమైన బూతులు మాట్లాడే నాయకులు మనకు అవసరమా? అని ధ్వజమెత్తారు.

చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతున్నారన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే వ్యవస్థను చూసి భయమేస్తోందని వ్యాఖ్యానించారు. చేసింది చెప్పుకోలేక బూతులు తిడుతున్నారని విమర్శించారు. ఇది మంచికి, మోసానికి జరుగుతున్న యుద్ధమని జగన్ అన్నారు.

క‌ట్ చేస్తే.. ఈ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు.. వారు వీరు అనే తేడా లేకుండా.. అంద‌రూ రియాక్ట్ అవుతున్నారు. ``బూతులు మాట్లాడే వారిని.. ప‌క్క‌న పెట్టాలి..`` అని కొంద‌రు అంటే.. ``ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రెవ‌రు ఎన్నెన్ని బూతులు మాట్లాడారో.. లెక్క‌లు తీయండి జ‌గ‌న్ స‌ర్‌!`` అని మ‌రొక‌రు వ్యాఖ్య చేశారు. మ‌రికొం ద‌రు.. దీనిపై అసెంబ్లీలో చ‌ట్టం చేయాల‌ని సూచించారు. ఇంకొంద‌రు.. బూతులు మాట్లాడే నేత‌ల‌ను పోటీకి కూడా ద‌రంగా ఉంచాలి..` అని సూచించారు. ఇలా.. అనేక మంది సోష‌ల్ మీడియాలో స్పందించారు. వీరంతా కూడా.. బుతులు మాట్లాడే నాయ‌కుల విష‌యంలో దాదాపు ఒకే ర‌కంగా రియాక్ట్ కావ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. వాస్త‌వానికి బూతులు మాట్లాడేవారిని క‌నుక ప‌క్క‌న పెట్టాల‌ని అనుకుంటే.. ముందుగా.. వైసీపీలోని నేత‌ల‌నే ప‌క్క‌న పెట్టాల్సి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ``అమ్మా మొగుడు``తో ప్రారంభించిన బూతులు.. ``లం... కొడ‌క``.. ``లం.. త్వం`` ``నా కొడుకులు`` అంటూ.. రెచ్చిపోయిన తొలి నాయ‌కులు వైసీపీనేత‌లే. ఆ స‌మ‌యంలో ఒక విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాలి.. టీడీపీ కానీ.. ఇత‌ర పార్టీలు కానీ.. దీనిని ఖండించా యి. `` మారండి బాబూ.. ఇదేం ప‌ద్ధ‌త‌ని`` సూచించాయి. క‌మ్యూనిస్టులు అయితే.. మ‌రింత ర‌గిలిపోయారు. అయినా.. మార్పు రాలేదు. పైగా.. మూడు రాజ‌ధానుల ఇష్యూ పై మాట్లాడే క్ర‌మంలో అస‌లు అదుపు త‌ప్పింది కూడా..  వారే.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. బూతులు మాట్లాడే వారిని.. త‌ప్పించాల‌న్నా.. వారినిప క్క‌న పెట్టాల‌న్నా.. చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అనుకున్నా.. ఖ‌చ్చితంగా.. వైసీపీలోని 50 మంది వ‌ర‌కు నాయ‌కులు ప‌క్క‌కు వెళ్లిపోవాల్సిందే.

అప్పుడే.. సీఎం జ‌గ‌న్ చెబుతున్న స్వ‌చ్ఛ‌మైన‌.. రాజ‌కీయాలు మ‌న‌కు ద‌క్కుతాయి!! అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి.. ఇది సాధ్య‌మేనా? జ‌గ‌న్ చేయ‌గ‌ల‌రా?   ముందు.. త‌న ఇంటి నుంచే సంస్క‌ర‌ణ  ప్రారంభిస్తే.. ఏపీలో నిజంగా ఎన్నిప‌థ‌కాలు ఇచ్చినా.. వ‌చ్చే పేరుకంటే దీంతో ఖ‌చ్చితంగా దేశ‌వ్యాప్తంగా మంచి గుర్తింపు ల‌భిస్తుంద‌ని.. అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News