ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ సంఖ్య నేడు కూడా 10వేల మార్క్ దాటింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 10,376 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,38,038కి పెరిగింది. అలాగే, గత 24 గంటల్లో ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 68గా ఉంది. దీంతో కలిపి మొత్తం ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 1349 కి పెరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో 9, గుంటూరు జిల్లాలో 13, అనంతపురంలో 9, కర్నూలు 8, విశాఖపట్నంలో 5, చిత్తూరులో 7, కడపలో 1, ప్రకాశం 6, విజయనగరంలో 1, కృష్ణాలో 1, నెల్లూరులో 4, శ్రీకాకుళంలో 4, పశ్చిమ గోదావరిలో ఇద్దరు కరోనాతో మరణించారు.
ఇక ఏపీలో మూడు జిల్లాల్లో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరిలో 1215, కర్నూలులో 1124, అనంతపురంలో 1387 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక పశ్చిమ గోదావరిలో 956, విశాఖపట్నంలో 983, గుంటూరులో 906, కడపలో 646, నెల్లూరులో 861 శ్రీకాకుళంలో 402, చిత్తూరులో 789, ప్రకాశంలో 406, కృష్ణాలో 313, విజయనగరంలో 388 కరోనా కేసులు నమోదయ్యాయి.