వస్తున్న ఎన్నికల్లో జగన్ కలలు నెరవేరాలంటే చంద్రబాబు వ్యూహాలను అడ్డుకోవడం కానీ నిలువరించడం కానీ చేయాలి. ఆ విధంగా చెక్ పెట్టకపోతే మళ్లీ అపజయాల బాట పట్టడం తథ్యం అన్నది ఇప్పటికే వైసీపీ వర్గాలకు అర్థం అయిపోయింది. అందుకే ఇప్పటి నుంచే కౌంటర్ వెర్షన్సు కొన్ని రెడీ చేస్తోంది.
ఇప్పటికే బుద్ధా వెంకన్నకు, కొడాలి నానికి మాటల యుద్ధం జరిగి, ఆగిపోయింది. రేపటి వేళ మళ్లీ అదే యుద్ధం మొదలు కాదు కాబోదు అని అనలేం కానీ ప్రస్తుతానికి నానికి కౌంటర్లు ఇచ్చే పని పెద్దగా టీడీపీ పెట్టుకోవడం లేదు. ఏమున్నా ఆ విజయవాడ లీడర్లే మాట్లాడాలి కానీ ఇతరులతో మాట్లాడించే ధైర్యం కానీ సాహసం కానీ టీడీపీ ఎందుకనో చేయడం లేదు.
వాళ్లు కూడా మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. ఓ సందర్భంలో వర్ల రామయ్య లాంటి సీనియర్ల పరువు కూడా నాని తీసేశారు కనుక ఇక ఆయన కూడా పెద్దగా మాట్లాడరు. అదేవిధంగా మరో సీనియర్ రాజేంద్ర ప్రసాద్ కూడా వెనక్కు తగ్గిపోయారు. ఈ దశలో టీడీపీ తగ్గిన క్రమంలోనే వైసీపీ మరికొంత వేగం పెంచుకుంటోంది.
అందుకే నిన్నటి వేళ దివ్యవాణి వ్యాఖ్యలను విపరీతంగా ట్రోల్ చేసింది. వైసీపీ శ్రేణులు మాత్రం ఇప్పటికిప్పుడు ఆమెను పార్టీలోకి రానివ్వద్దనే అంటున్నారు. గతంలో కూడా ఆమె వాడిన భాష ఏం బాలేదు. అధినేత మనసులో ఏముందో తెలియదు కనుక ఒకవేళ ఆమె పార్టీలోకి వస్తే, చాలా మంది డైలమాలో పడిపోవడం ఖాయమని తెలుస్తోంది.
దీంతో జగన్ కు ఇప్పటి నుంచే కొందరు ముందస్తు జాగ్రత్తలే కాదు హెచ్చరికలూ పంపిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఒకవేళ పార్టీలోకి వస్తే బ్రదర్ అనీల్ మాదిరిగా కానీ, కేఏపాల్ మాదిరిగా కానీ క్రీస్టియన్ మైనార్టీ ఓట్లను ఆకర్షిస్తారని భావిస్తున్నారు.
అందుకే ఆమె కూడా ఇప్పటికే రోజాలాంటి లీడర్లను పెద్దగా కామెంట్ చేయకుండా జాగ్రత్త పడ్డారు మొన్నటి వేళ జరిగిన ఓ ఇంటర్వ్యూలో ! అంటే రోజా లాబీయింగ్ ద్వారా ఆమె ఇప్పుడు వైసీపీ గూటికి చేరుతారా? చేరితే అప్పటిలా ఆమె మళ్లీ భాషను ఉపయోగించి వీలుంటే మోడీనీ, వీలున్నా లేకపోయినా తనను నిలువరించిన టీడీపీ నాయకులనూ తిట్టిపోస్తారా ? ఏమో ! మరి ! రాజకీయం లో ఏమయినా జరగవచ్చు. ఆ విధంగా గుర్రం ఎగరావచ్చు.