వాట్సాప్‌తో ఏపీడీసీ ఒప్పందం... టీడీపీ, జనసేన రిపోర్టు స్పామ్ కొట్టే ఛాన్స్ ఉందా?
వచ్చే ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసుకోవాలని భావిస్తున్న ఏపీలోని జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఏపీ డిజిటల్ కార్పోరేషన్(ఏపీడీసీ) ఇప్పుడు వాట్సాప్ సేవలను కూడా ప్రారంభించింది. ఇందుకోసం వాట్సాప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇంటర్‌నెట్ వాడేవారి సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వేదిక అవసరాన్నీ, ప్రాముఖ్య తనూ గుర్తించిన వాట్సాప్ ఇండియా ఏపీడీసీ వాట్సాప్ వేదికకు పూర్తి సాంకేతిక మద్దతు అందిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు, పథకాలు, నిర్ణయాలకు సంబంధించిన సమాచారం రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ మరింత వేగంగా అందనుంది.
ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు చేపట్టి సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంతో పాటు.. ఈ విషయాలపై తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించేందుకు కూడా ఈ వాట్సాప్ సేవలు మరింతగా ఉపయోగపడతాయని ఏపీడీసీ భావిస్తోంది. ఈ సేవల విస్తరణలో భాగంగా త్వరలో పూర్తి స్థాయి వాట్సాప్ చాట్‌బోట్ సేవలను కూడా ఏపీడీసీ అందించనుంది.
ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల సమాచారాన్ని రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చేరవేయడంలో ఏపీడీసీ ప్రారంభించబోయే ఈ వాట్సాప్ చాట్‌బోట్ సేవలు ఉపయోగపడనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రగతిశీల అజెండాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు వాట్సాప్‌తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని ఏపీడీసీ వైస్ చైర్మన్ , ఎండీ చిన్న వాసుదేవరెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో ఇ-గవర్నెన్స్ మరింత మెరుగుపరిచే ప్రయత్నంలో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం తమకు గర్వంగా ఉందని, వైవిధ్యభరితమైన, ప్రతి అవసరానికి తగిన ఇ-గవర్నెన్స్ పరిష్కారాలు రూపొందించేందుకు వాట్సాప్ వేదిక ద్వారా నిరంతరం పనిచేస్తామని వాట్సాప్ ఇండియా పబ్లిక్ పాలసీ అధిపతి శివనాథ్ ఠూక్రాల్ అన్నారు.
సోషల్ మీడియాలో చర్చ ఇదే!
రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్‌తో ఒప్పందం చేసుకున్న దరిమిలా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, జనసేనలు రిపోర్టును స్పామ్ కొట్టడానికి రెడీగా ఉన్నాయా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇదే తరహా చర్చ సాగుతోంది. ఇంతకీ స్పామ్ అంటే.. ఏంటంటే.. స్పామ్ అనేది పెద్దమొత్తంలో పంపబడే అవాంఛిత, అయాచిత డిజిటల్ కమ్యూనికేషన్. తరచుగా స్పామ్ ఇ మెయిల్ ద్వారా వస్తుంది. దీనివల్ల.. అసలుకు.. వాస్తవానికి మధ్య తేడా ఉన్నట్టుగా చూపడంతోపాటు.. పెద్ద ఎత్తున ప్రజలను లేదా నెటిజన్లను తప్పు దోవపట్టించేందుకు అవకాశం ఉంటుంది.
అంతేకాదు.. వచ్చిన సమాచారాన్ని కనిపించకుండా.. `స్పామ్` ఆప్షన్‌లోకి పంపేసే అవకాశం ఉంటుంది. అంటే.. ఇది నేరుగా ప్రజలకు కనిపించదు. సదరు సందేశం వచ్చిన విషయం కూడా తెలిసే అవకాశం లేదు. స్పామ్ లోకి వెళ్లి వెతుక్కుంటే తప్ప.. ఏం వచ్చింది..? ఎలాంటి సందేశం చేరింది? అనే విషయాలు కూడా తెలియదు. ఇది ఒకరకంగా.. ప్రజలను తప్పుదోవ పట్టించడం.. లేదా.. సదరు సందేశాలను ప్రజలకు చేరకుండా అడ్డుకోవడం కిందకే వస్తుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.