ఐఫోన్.. చేతిలో ఉంటే ఆ ఇమేజే వేరు. ఐఫోన్ వాడే వారిని ప్రత్యేకంగా చూడటం మొదట్నించి ఉన్నదే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక్కరూ ఒక్క సిమ్ ను వాడే పరిస్థితి లేదు. రెండు.. మూడు..కొందరైతే ఏకంగా నాలుగు సిమ్‌లు వాడేస్తున్న వారు లేకపోలేదు.
ఇలాంటి వారికి.. ఐఫోన్ తో మహా ఇబ్బందికరంగా మారుతోంది. ఐఫోన్ లో ఒక్క సిమ్ కు అవకాశమే ఉండటం తెలిసిందే. దీంతో.. ఐఫోన్ వాడే వారు.. తమకుండే మరో సిమ్ కోసం ఇంకో ఫోన్ వాడాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ లోటు ఏళ్లకు ఏళ్లుగా ఉన్నా.. చుట్టూ ఉన్న ప్రపంచం మారినా.. యాపిల్ మాత్రం తన బాటను వదిలేందుకు ఇష్టపడని పరిస్థితి.
అయితే.. తాజాగా విడుదల చేసిన కొత్త మోడల్ లో .. తన పాత తీరుకు భిన్నమైన అంశాలతో కూడిన సరికొత్త ఐఫోన్ వెర్షన్ ను విడుదల చేశారు. యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్.. తాజాగా ఐఫోన్ 10ఎస్ ఫోన్లను ఆవిష్కరించారు. 5.9 అంగుళాలు.. 6.5 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లేతో తాజా ఫోన్లు లభిస్తున్నాయి.
64.. 128.. 256.. 512 జీబీల మెమరీ వేరియంట్లతో ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబరు 14 నుంచి ప్రీఆర్డర్లు తీసుకోనున్నారు. ఈ నెల 21 నుంచి వీటిని డెలివరీ షురూ చేస్తారు. రెండో దశ డెలివరీ సెప్టెంబరు 28 నుంచి మొదలు కానుంది. ఆ సమయంలోనే భారత్ లోనూ కొత్త వెర్షన్ ఫోన్లను విడుదల చేయనున్నారు. ఐఫోన్ 10 ఎస్ ధర 999 డాలర్లు ఉండగా.. ఐఫోన్ 10 ఎస్స్ మ్యాక్స్ ధర ఏకంగా 1099 డాలర్లుగా ఉండనున్నాయి. ఈ రెండు ఫోన్లలోనూ డ్యూయల్ సిమ్ ఆప్షన్ ఇస్తున్నారు.
ఐఫోన్లతో పాటు వాచ్ సిరీస్ లో 4 వెర్షన్ ను కంపెనీ లాంఛ్ చేసింది. గత వాచ్ లతో పోలిస్తే.. ఈసారి వాచ్ ల స్క్రీన్లు 30 శాతం పెద్దదిగా ఉండనున్నట్లు చెబుతున్నారు. కిందపడిపోయే అవకాశాల్నిముందుగా గుర్తించి హెచ్చరించటంతో పాటు.. గుండె కొట్టుకునే వేగాన్ని లెక్కించే సౌకర్యం ఈ వాచ్ లో ఉండనుంది.