జ్ఞ అక్ష‌రానికి చెక్ పెట్టిన ఆపిల్ సంస్థ‌

Update: 2018-02-20 08:38 GMT
ఇప్పటి వరకూ ప్రపంచలోనే దాన్ని తలదన్నే ఫోన్ రాలేదు. ప్రపంచంలోనే టాప్‌ బ్రాండ్‌. చేతిలో ఐఫోన్ ఉంటే అది ఓ స్టేటస్ సింబల్. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడే బ్రాండ్‌ ఇదే. ఇలాంటి ఐఫోన్ కు ఓ తెలుగు అక్షరం ఇబ్బంది పెడుతోంది. “జ్ఞ” అనే తెలుగు అక్షరం టైప్‌ చేస్తే ఫోన్‌ లోని యాప్స్‌ అన్నీ వాటంతట అవే క్రాష్‌ అవుతున్నాయి.దీనిపై స్పందించిన ఆపిల్ సంస్థ ఐవోస్ లో సాంకేతిక లోపం త‌లెత్తింద‌ని, సమ‌స్య‌ని గుర్తించి బ‌గ్ ను ఫిక్స్ చేస్తామ‌ని హామీ ఇచ్చింది. అన్న‌ట్లు గా బ‌గ్ ను ఫిక్స్ చేసిన ఆపిల్ సంస్థ 11.2.6 కొత్త వెర్ష‌న్ ను అందుబాటులోకి తెచ్చింది.  

కొద్దిరోజుల క్రితం యాపిల్  సంస్థ  ఐవోఎస్ 11.2.5 లో సాంకేతిక లోపం త‌లెత్తింది. ఎవ‌రైనా తెలుగులో జ్ఞ అనే అక్ష‌రాన్ని టైప్ చేస్తే మెసేజింగ్ యాప్ - వాట్సాప్ - ట్విట్ట‌ర్ లు క్రాష్ అయ్యాయి.  స్ప్రింగ్ లోడింగ్ డిస్‌ ప్లేతో మొత్తం బ్లాక్ అవ్వ‌డంతో క‌ష్ట‌మ‌ర్లు స‌ద‌రు సంస్థకు ఫిర్యాదులు చేశారు. తొల‌త ఈ బ‌గ్ ను ఇటలీకి చెందిన మొబైల్ వరల్డ్ అనే బ్లాగ్ గుర్తించింది. భార‌త్ కు చెందిన ఓ భాష యెక్క అక్ష‌రాన్ని ఎవ‌రు టైప్ చేయోద్ద‌ని, ఒక‌వేళ చేస్తే ఐఫోన్ యాప్స్ అన్నీ బ్లాక్ అవుతున్నాయంటూ టామ్ వారెన్ అనే టెక్ నిపుణుడు ట్వీట్ చేశాడు. ఈ వార్త దావ‌నంలా పాక‌డంతో ఆపిల్ సంస్థ‌రంగంలో దిగింది. తలెత్తిన స‌మ‌స్య‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతూ త‌క్ష‌ణ‌మే బ‌గ్ ను ఫిక్స్ చేస్తామ‌ని వెల్ల‌డించింది.

తాజాగా ఆపిల్ సంస్థ ఐవోఎస్-11.2.6 కొత్త వెర్ష‌న్ కు బ‌గ్ ను ఫిక్స్ చేసి విడుద‌ల చేసింది. దీంతో జ్ఞ అనే అక్ష‌రం తో  టీవీఐవోఎస్  - మాక్ ఐవోఎస్ ల‌కు ఎటువంటి స‌మ‌స్య‌లు లేవ‌ని ది వెర్జ్ అనే బ్లాక్ ప్ర‌క‌టించింది.

జ్ఞ అక్ష‌రంతో ఉన్న మెసేజ్ ను రిసీవ్ చేసుకునే వ్య‌క్తి ఫోన్ల‌లో ఐవీఎస్ వ‌ల్ల బ్లాక్ అయ్యేది. కొన్ని సార్లు ఇద్దరు చేసుకున్న మెసేజ్ లు డిలీట్  అయ్యేవి.

కానీ రాబోయే ఆపిల్ ఐవోఎస్ 11.3 కొత్త వెర్ష‌న్ లో ఇలాంటి  స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.  అగ్‌ మెంటెడ్ రియాలిటీ (AR) అప్ గ్రేడ్ అనిమోజీ ల‌తో వినియోగ‌దారుణ్ని ఆక‌ట్టుకునేలా రూపొందిస్తున్న‌ట్లు ఆపిల్ సంస్థ ప్ర‌క‌టించింది.

Tags:    

Similar News