స్మార్ట్ ఫోన్ వార్నింగ్ తో బతికిపోయాడు

Update: 2015-09-28 22:30 GMT
అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని సరిగ్గా వినియోగిస్తే సంజీవినిలా పని చేస్తుందన్న సత్యం మరోసారి నిరూపితమైంది. యాపిల్ సంస్థ తయారు చేసిన స్మార్ట్ వాచ్ పుణ్యమా అని ఒక కుర్రాడు బతికిపోయాడు. యాపిల్ వాచ్ ను పెట్టుకోకుంటే ఆ కుర్రాడి ప్రాణాలు పోవటం ఖాయమని చెబుతున్నారు. ఇంతకీ కుర్రాడి ప్రాణాన్ని ఆపిల్ వాచ్ ఎలా కాపాడిందన్న విషయాన్ని చూస్తే..

అమెరికాకు చెందిన పాల్ మాసాచుసెట్స్ లోని టాబర్ అకాడమీలో చదువుతున్నాడు. 18 ఏళ్ల ఈ కురరాడు ఫుట్ బాల్ గేమ్  శిక్షణలో పాల్గొన్నాడు. విపరీతమైన ఎండలో ఆడుతున్న ఇతగాడిని.. అతను పెట్టుకున్న యాపిల్ వాచ్ వార్నింగ్ ఇచ్చింది. అతడి గుండె నిమిషానికి 145 సార్లు కొట్టుకుంటుదని.. జాగ్రత్తగా ఉండమంది.

ఆట ధ్యాసలో పడిన అతగాడు.. ఆపిల్ వాచ్ ఇస్తున్న వార్నింగ్ ను లైట్ తీసుకున్నాడు. వాచ్ చెడిపోవటం వల్లే ఇంత భారీ హార్ట్ బీట్ చూపిస్తుందని అతను అనుకున్నాడు. కానీ.. అతని కోచ్ కు ఈ విషయం చెప్పాడు. వెంటనే అలెర్ట్ అయిన అతను.. పాల్ కు వైద్య పరీక్షలు జరిపి.. అతను అత్యవసర పరిస్థితుల్లో ఉన్నట్లు.. ప్రాణాపాయం అంచుల్లో ఉన్న విషయాన్ని గుర్తించి.. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు.

అత్యధిక ఉష్ణోగ్రతలో విపరీతమైన అలసటకు గురైన వారి శరీరంలోని కండరాలు విచ్చిన్నం అయి.. ఓ ప్రోటీన్ ను రక్తంలోకి విడుదల చేస్తుంది. ఆ ప్రోటీన్ తో శరీరంలోని అవయవాలు పని చేయటం విఫలమై.. ప్రాణం మీదకు తెస్తాయి. శరీంలో చోటు చేసుకునే ఇలాంటి మార్పుల్ని గుర్తించేలా యాపిల్ స్మార్ట్ వాచ్ లను తయారు చేయటంతో.. పాల్ బతికిపోయాడు. సో.. స్మార్ట్ వాచీల వార్నింగ్ ను సీరియస్ గానే తీసుకోవాలన్న మాట.
Tags:    

Similar News