నన్ను లేపేస్తారేమో.. భయం గా ఉంది: వివేకానందరెడ్డి కేసులో అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదు
ఏపీ అధికార పార్టీ వైసీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ సీఎం జగన్ చిన్నానన్న , మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అఫ్రూవర్‌గా మారిన దస్తగిరి కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తొండూరు పోలీసులు తనపై అక్రమ కేసులు పెట్టారని ఆయన ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా తొండూరుకు చెందిన పెద్ద గోపాల్ తరచూ తనను లక్ష్యంగా చేసుకుని గొడవ పడుతున్నారని, ఏదో విధంగా తనను అంతం చేయాలని చూస్తున్నారని దస్తగిరి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్నాననే ఉద్దేశంతో తనను లేపేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ ఫిర్యాదులో తెలిపారు. తనపై తప్పుడు కేసు పెట్టిన విషయాన్ని సీబీఐ ఎస్పీ రాంసింగ్‌కు కూడా వివరించినట్లు దస్తగిరి తెలిపారు.
తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. గత కొద్ది రోజుల నుంచి తొండూరు మండలానికి చెందిన పెద్ద గోపాల్ అనే వ్యక్తి తనను లక్ష్యంగా చేసుకుని గొడవ పడుతున్నాడని చెప్పారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని అన్నారు. అప్రూవర్‌గా మారిన తనను అంతం చేయడానికి పులివెందులకు చెందిన వైసీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని డ్రైవర్ దస్తగిరి ఆరోపించారు. గత కొద్ది రోజుల నుంచి తొండూరు మండలానికి చెందిన పెద్ద గోపాల్ అనే వ్యక్తి తరచూ తనతో.. తన కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆక్షేపించారు.
ఆదివారం తన సోదరుడు మస్తాన్తో గొడవపడి తనను ఇష్టాను సారంగా బూతులు తిట్టడంతో పోలీస్ స్టేషన్కు వెళ్లానని.. పోలీసులు ఎదురుగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతో అతనిపై తాను చేయి చేసుకున్నానని దస్తగిరి తెలిపారు. దాన్ని కారణంగా చూపి.. పోలీసులు తనపై కేసు నమోదు చేశారని దస్తగిరి వాపోయారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టారని దస్తగిరి తెలిపారు. ఇక్కడ జరిగిన విషయాలన్నిటిపై.. కడప ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వచ్చానని దస్తగిరి తెలిపారు. ఈ మేరకు లిఖిత పూర్వకంగా రాసిన ఫిర్యాదు పత్రాన్ని ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. గత కొద్ది కాలంగా తనపై జరుగుతున్న కుట్ర విషయాలను సీబీఐ అధికారి రాంసింగ్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు దస్తగిరి పేర్కొన్నారు. తన ప్రాణాలకు ఏం జరిగినా వైసీపీ నాయకులదే బాధ్యత అన్నారు.
పోలీసులు రక్షణ కల్పించట్లేదు
దస్తగిరిభద్రత కంటే తన కదలికల పైనే పోలీసు సిబ్బంది ఎక్కువ దృష్టి సారించారని దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యర్థుల నుంచి తనకు తగినంత రక్షణ కల్పించాలని వేడుకున్నారు. కోర్టు ఈ నెల 20నే ఉత్తర్వులిచ్చినా, ఇంకా పోలీసుశాఖ ఎలాంటి భద్రత కల్పించలేదన్నారు. భద్రత సిబ్బంది నియామకంపై ఎస్పీ అన్బురాజన్‌ను కోర్టు అడగగా.. అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకున్నట్లు కోర్టుకు బదులిచ్చారని చెప్పారు. భద్రతా సిబ్బందిని నియమించలేదనే విషయాన్ని తాజాగా సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌కు చెప్పగా, కోర్టు ఉత్తర్వుల పత్రాన్ని తనకు పంపిస్తానని తెలిపారన్నారు.
జీవనోపాధి కోసం తొండూరు మండలం మల్లేల గ్రామ పరిసరాల్లో అద్దెకు ట్రాక్టర్‌ను తిప్పుతున్నానని, రెండు రోజులకోసారి అందుకోసం వెళ్లాల్సి ఉందన్నారు. అయిదు నెలల కిందట నియమించిన 1+1 పోలీసు సిబ్బంది ఇంటి వరకే కాపలా ఉంటున్నారని, బయటకు వెళుతున్నప్పుడు తన వెంట రారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మరి దీనిపై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.