తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఇప్పుడు నిజంగానే పెను కలకలం రేగింది. టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అత్యంత సన్నిహితుడిగా - ఆర్థిక వనరుగా ప్రసిద్ధికెక్కిన మైహోం ఇండస్ట్రీస్ అధినేత జూపల్లి రామేశ్వరరావు టార్గెట్ గా ఆదాయపన్ను శాఖ సోదాలు మొదలుపెట్టింది. రామేశ్వరరావు ఇల్లు - కార్యాలయాలపై ఏకకాలంలో విరుచుకుపడ్డ ఐటీ అధికారులు... అణువణువూ సోదాలు చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ పరిధిలోని నందగిరి హిల్స్ లోని రామేశ్వరరావు ఇంటిపై దాడి చేసిన ఐటీ అధికారులు... అదే సమయంలో మైహోం కార్యాలయం పైనా విరుచుకుపడ్డారు.
ఏకంగా వంద మంది దాకా ఐటీ అదికారులు దాడుల్లో పాలుపంచుకోవడంతో నందగిరి హిల్స్ లో పెను కలకలమే రేగింది. అదే సమయంలో మైహోం కార్యాలయం పరిసరాల్లో కూడా ఈ సోదాలు మొదలవడంతో... ఇప్పుడు అన్ని న్యూస్ ఛానెళ్లు - వెబ్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ తనకు కొరుకుడు పడని నేతలను ఐటీ దాడులతో దారికి తెచ్చుకుంటారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రామేశ్వరరావు ఇల్లు - కార్యాలయాలపై ఐటీ సోదాలు.. కేసీఆర్ ను దారికి తెచ్చుకునేందుకేనా అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు మొదలయ్యాయి. మరి ఈ దాడుల్లో ఏఏ అక్రమాలు బయటపడ్డాయన్న విషయాలపై మరింత మేర ఆసక్తి రేకెత్తుతోంది.