మోడీపై యుద్ధానికి ప్రాంతీయ పార్టీల నేత‌లు సిద్ధ‌మ‌వుతున్నారా?

Update: 2021-05-03 17:30 GMT
ప్ర‌స్తుత ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. దేశంలో రాజ‌కీయాలు వ‌డివ‌డిగా మారుతున్నాయి. ప్ర‌ధాన మంత్రి న‌రేం ద్ర మోడీ ప్ర‌భ దిగ‌జారిపోతోంది. ఎక్క‌డిక‌క్క‌డ ఆయ‌నపై వ్య‌తిరేక‌త పెరుగుతోంది. ఈ ప‌రిణామం.. దేశ రాజ కీయాల‌ను కూడా మారుస్తోంద‌నే భావ‌న వ్య‌క్తం అవుతోంది. తాజాగా వ‌చ్చిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫ‌లితాల ను గ‌మ‌నిస్తే.. బీజేపీలో మోడీ , అమిత్ షాల రాజ‌కీయాలు పార‌డం లేద‌నే వాస్త‌వం క‌ళ్ల‌కు క‌డుతోంది. బెంగా ల్‌లో అధికారంలోకి వ‌చ్చేస్తామ‌ని చెప్పినా, త‌మిళ‌నాడులో అన్నాడీఎంకేతో క‌లిసి అధికారం పంచుకుంటా మ‌ని చెప్పినా.. బీజేపీ వైపు ప్ర‌జ‌లు మొగ్గు చూప‌లేదు.

దీంతో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భ మ‌స‌క‌బారుతోంద‌నే వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. అయితే.. ఇది మ‌రో రూపంలో ఆయ‌న‌పై ప్రాంతీయ పార్టీలు యుద్ధం చేసేందుకు దారితీస్తోంద‌ని చెబుతున్నారు ప‌రిశీల కులు. బీజేపీ యేత‌ర రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌కు, ముఖ్య‌మంత్రుల‌కు ఇత‌ర ప్ర‌తిక్ష పార్టీల‌కు కూడా మోడీ విధా నాలు న‌చ్చ‌డం లేదు. ముఖ్యంగా క‌రోనా విష‌యంలో మోడీ అనుస‌రిస్తున్న ప‌ద్ధ‌తిపై ప్ర‌జ‌ల్లో ఆవేద‌న ఆందోళ న ఉండ‌డం గ‌మ‌నార్హం.దేశంలో త‌యారైన టీకాను విదేశాల‌కు త‌ర‌లించేందుకు ఇచ్చిన శ్ర‌ద్ధ దేశ ప్ర‌జ‌ల‌కు టీకా ఇవ్వ‌డంలో మోడీ చూపించలేక పోయారు.

దీంతో ప్ర‌జ‌ల్లో మోడీపై వ్య‌తిరేక‌త పెరుగుతోంది. ఇక‌, పాల‌కుల విష‌యానికి వ‌స్తే.. క‌రోనా ఎఫెక్ట్‌తో రాష్ట్రాల కు ఆదాయం త‌గ్గిపోయింది. ఈ క్ర‌మంలో వారిని ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వం..అప్పులు చేసుకోవాల‌ని చెప్ప డం.. టీకా విష‌యంలో ద్వంద్వ ప్ర‌మాణాల‌కు పోవ‌డం, ప్రాంతీయ పార్టీల‌ను అణిచి వేసేలా కుట్ర‌ల‌కు పాల్ప‌డ‌డం.. వంటి ప‌రిణామాలు.. ఆయా పార్టీల నేత‌ల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే వీరంతా సంఘ‌టితం అయ్యేందుకు పావులు క‌దుపుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే బెంగాల్ ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలోనే బీజేపీయేత‌ర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల‌కు బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ.. లేఖ‌లు రాశారు.

అయితే.. అప్ప‌ట్లో ఈ విష‌యంపై నాయ‌కులు.. వేచి చూసే ధోర‌ణిని అవ‌లంబించారు. అంటే.. బెంగాల్ స‌హా ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో బీజేపీ ఊపు ఎలా ఉంటుంద‌నే విష‌యాన్ని నిశితంగా గ‌మ‌నించారు. ఇక‌, ఇప్పుడు ఫ‌లితాలు రావ‌డం.. బీజేపీకి అన్ని చోట్లా ఎదురు దెబ్బ‌త‌గ‌ల‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు మ‌ళ్లీ సంఘ‌టిత‌మై.. కేంద్రంలోని మోడీ సెంట్రిక్‌గా యుద్ధం ప్రారంభించే ఛాన్స్ క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. జ‌మిలి జ‌రిగినా.. లేక వ‌చ్చే ఎన్నిక‌ల నాటికైనా.. స‌రే.. మోడీని దెబ్బ‌కొట్టి.. రాష్ట్రాల హ‌క్కుల‌పై జ‌రుగుతున్న నియంతృత్వాన్ని నిలువ‌రిద్దామ‌ని.. ఈ నేత‌ల మాట‌గా ఉంది. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల డిమాండ్లే పార్టీ నేత‌ల అజెండా మార‌నుంద‌ని తెలుస్తోంది. ఈ పోరులో ఒక్క తెలంగాణ సీఎం, ఢిల్లీ సీఎం, బెంగాల్ సీఎం మాత్ర‌మే కాకుండా.. అనేక మంది క‌లిసి వ‌స్తార‌ని తెలుస్తోంది. మ‌రి ఈ ప‌రిణామం దేశ రాజ‌కీయాల‌ను ఎలాంటి మ‌లుపు తిప్పుతుందో చూడాలి.
Tags:    

Similar News