వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ లోని నలుగురు ఎంఎల్ఏలను ఓడించటమే ఈటల రాజేందర్ టార్గెట్టుగా పెట్టుకున్నారా ? జిల్లాలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానంగా ఉంది. విషయం ఏమిటంటే హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటలను ఓడించటానికి వరంగల్ జిల్లాలోని నలుగురు ఎంఎల్ఏలు శక్తివంచన లేకుండా పనిచేశారట. తమ ప్రయత్నాల్లో భాగంగా ఈటలపై బాగా బురదచల్లారట. దాంతో ఎంఎల్ఏగా గెలిచిన తర్వాత ఆ నలుగురి కత చెబుతానని ఈటల అప్పట్లోనే చాలెంజ్ చేశారు.
అన్నట్లుగానే ఎంఎల్ఏగా గెలిచి చరిత్ర సృష్టించారు. ఎంఎల్ఏగా గెలిచిన దగ్గర నుండి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, పరకాల నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఈ నలుగురు ఎంఎల్ఏలపై టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలెవరు ? వారిలోని అసంతృప్తి ఏస్ధాయిలో ఉందనే విషయాన్ని ముందుగా ఆరాతీశారు. అసంతృప్తుల జాబితాను సిద్ధం చేసుకున్నారు. పరోక్షంగా, వాళ్ళకి తనకు కామన్ ఫ్రెండ్స్ ద్వారా సీక్రెట్ ప్లేసులో మీటయ్యారు.
వాళ్ళకి కావాల్సిన హామీలిచ్చి తనకు కావాల్సింది రాబట్టుకున్నారట. దాంతో ఈటల ప్లాన్ వర్కవుటైంది. నర్సంపేట నియోజకవర్గంలో నెక్కొండ మాజీ ఎంపీపీ గటిక అజయ్ కుమార్ అండ్ కోతో భేటీ అయి వారికి కావాల్సిన హామీలిచ్చారు. దాంతో వాళ్ళంతా టీఆర్ఎస్ వదిలేసి బీజేపీలో చేరిపోయారు. అలాగే మరో యువనేత రాణాప్రతాప్ రెడ్డి కూడా టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కమలం తీర్ధం పుచ్చుకున్నారు.
ఇక వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావును బీజేపీలోకి లాగేసుకున్నారు. బహుశా వచ్చే ఎన్నికల్లో అన్నకు పోటీగా బీజేపీ నుండి ప్రదీపే పోటీచేయచ్చు. అలాగే వర్ధన్నపేట, పరకాలలో కూడా అసంతృప్తులకు గాలమేస్తున్నారు. చాలామంది ఎంఎల్ఏలపై అసంతృప్తితో ద్వితీయశ్రేణి నేతలున్నారు. అలాంటి వాళ్ళందరితో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. సుదీర్ఘకాలం టీఆర్ఎస్ లో ఉండటం ఇపుడు ఈటలకు బాగా ఉపయోగపడుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.