కొత్త కేసుల్లో బాధితులు యూత్ ఎక్కువా?

Update: 2021-04-13 11:30 GMT
కరోనా కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. భారీగా పెరిగిపోతున్న కేసుల నేపథ్యంలో ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాల్సిన అవసరం అందరి మీదా పడింది. గతంలో పెద్ద వయస్కులు..మధ్య వయస్కుల మీదనే ఎక్కువ ప్రభావం చూపేది. కొత్త కేసుల్లో అత్యధికులు ఈ వయస్కుల వారే ఉండేవారు. కానీ.. తాజాగా నమోదవుతున్న కేసుల్లో 40 శాతం యూత్ అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇటీవల కాలంలో రోగ తీవ్రతతో ఆసుపత్రుల్లో చేరే వారిలో యువతే ఎక్కువగా ఉండటం గమనార్హం.

ప్రభుత్వం వెల్లడిస్తున్న గణాంకాల ప్రకారం 21- 45 ఏళ్ల లోపు పాజిటివ్ కేసుల్లో 43 శాతం ఉందన్నది మర్చిపోకూడదు. మిగిలిన అన్ని వయస్కుల వారితో పోలిస్తే.. యూత్ ఎక్కువ మంది పాజిటివ్ బారినపడటం ఆందోళనకు గురి చేస్తుంది. ఎందుంటే.. ఈ వయస్కుల వారితో ఉండే ఇబ్బంది.. వారి ఆధారంగా మొత్తం కుటుంబం ఆధారపడి ఉంటుందన్నది మర్చిపోకూడదు.

ఈ యూత్ గ్రూపులో అత్యధికులు సంపాదనా పరులే ఉంటారు. చాలా కుటుంబాలకు వారే ఆర్థికంగా దన్నుగా నిలుస్తుంటారు. ఇంటికి అండగా ఉండే వారే.. కోవిడ్ బారిన పడితే.. ఆ ఇంట్లో ఉండే టెన్షన్ అంతా ఇంతా కాదు. గడిచిన నెల వ్యవధిలో 28,812 కేసులు వస్తే.. అందులో 12,677 మంది 21-45 ఏళ్ల మధ్య వారు ఉండటం గమనార్హం. ఇక.. రాష్ట్రంలో అధికారికంగా కరోనా కారణంగా మరణించిన వారు 1765 కాగా.. అందులో 776 మంది 21-45 మధ్య వయస్కుల వారు కావటం గమనార్హం.

గత ఏడాదిలో కరోనా కేసులు భారీగా నమోదైన సమయంలో.. అత్యధిక కేసులు 50 ఏళ్లకు పైబడిన వారే ఉండేవారు. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా 21-45 వయస్కుల వారు ఉండటం ఆందోళనకు గురి చేసే అంశంగా చెప్పాలి. ఈ వయస్కుల వారు ఎక్కువగా ఎందుకు బాధితులు అవుతున్నారన్న విషయంలోకి వెళితే.. ఎక్కువగా ప్రజా రవాణాను వాడటం.. ఉద్యోగ.. వ్యాపారాల్లో తలమునలకు కావటం.. ఎక్కువగా బయటకు వచ్చి వెళ్లటం.. రకరకాల వారిని కలవటం.. తరచూ షేక్ హ్యాండ్ లు ఇవ్వటంతోపాటు.. ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ ఫుడ్ షేరింగ్ లాంటి వాటిని అనుసరించటం కూడా ఎక్కువ కేసుల నమోదుకు కారణంగా చెప్పొచ్చు. సో.. బీకేర్ ఫుల్.
Tags:    

Similar News