ఏపీకి త్వ‌ర‌లోనే తీపిక‌బుర‌న్న కేంద్ర మంత్రి

Update: 2016-08-16 07:20 GMT
ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఎంతో ఆస‌క్తిగా ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కి తీపి క‌బురు అందించారు కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్ వాల్. ఇటీవ‌లి కాలంలో ఏపీ హోదా విష‌యం కేంద్రంలో సెంట‌ర్ ఆఫ్ ది టాపిక్‌ గా మారిపోయింది. ఏ న‌లుగు ఎంపీలు ఒక్క‌చోట‌కి చేరినా - ఏ ఇద్ద‌రు కేంద్ర మంత్రులు ఓ ద‌గ్గ‌ర కూర్చున్నా ఏపీ విష‌యంపైనే టాపిక్‌! ఇక‌, ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఏపీలో అయితే - ప‌రిస్థితి హాట్ హాట్‌! కేంద్రం ఏమిచ్చినా.. ఇవ్వ‌క‌పోయినా.. హోదా మాత్రం ఇవ్వాల‌నే టాక్ పెరిగిపోయింది. దీంతో సీఎం చంద్ర‌బాబు స‌హా టీడీపీ - వైసీపీ అనే తేడా లేకుండా అంద‌రి దృష్టీ ఢిల్లీపైనే ఉంది. దీనికితోడు ఆగ‌స్టు 15 సందేశంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు కేంద్రంపై ఓ రేంజ్‌ లో విరుచుకుప‌డ్డారు.

 హోదాపై ఏమీ చెప్ప‌డం లేద‌ని ఫైర‌య్యారు.ఇంత‌లో హ‌ఠాత్తుగా కేంద్రం నుంచి ఓ తీపి క‌బురు మోసుకొచ్చారు మంత్రి అర్జున్ మేఘ్ వాల్‌. ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న కృష్ణా పుష్క‌రాల‌కు దేశంలోని ఎంద‌రో ప్రముఖుల‌ను ఆయ‌న ఆహ్వానించారు. ఈ క్ర‌మంలోనే బాబు ఆహ్వానం మేర‌కు మంగ‌ళ‌వారం ఉద‌యం విజ‌య‌వాడ‌కు వ‌చ్చారు కేంద్ర మంత్రి. శాస్త్రోక్తంగా ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో పుష్క‌ర స్నానం పూర్తి చేసుకున్న అనంతరం ఆయ‌న క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి స్వాంత‌న చేకూరే క‌బురు చెప్పారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంపై కేంద్రం త‌ల‌మున‌క‌లుగా చ‌ర్చిస్తోంద‌న్నారు.  అంతేకాదు, విభ‌జ‌న‌తో తీవ్రంగా న‌ష్ట‌పోయిన ఏపీ త‌మ‌కు ప్ర‌త్యేక రాష్ట్రంగా కేంద్రం భావిస్తోంద‌ని చెప్పుకొచ్చారు. ఇప్ప‌టికే ఈ రాష్ట్రానికి ఏ మివ్వాల‌నే అంశంపై చ‌ర్చ జ‌రిగింద‌ని త్వ‌ర‌లోనే ఫ‌లితాలు అందుతాయ‌ని అన్నారు. అదేస‌మ‌యంలో పుష్క‌రాల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారంటూ సీఎం చంద్ర‌బాబును పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు కేంద్ర మంత్రి. దీంతో ఇప్పుడు ఈ వార్త ఏపీ రాజ‌కీయ ప‌క్షాలు స‌హా ప్ర‌జ‌ల్లోనూ ఖుషీని నింపింది.

ముఖ్యంగా టీడీపీ నేత‌ల ఆనందంలో హ‌ద్దులేకుండా పోయింది. అయితే, సోమ‌వారం విజ‌య‌వాడ‌లో స్నానం చేసిన మ‌రో కేంద్ర మంత్రి జావదేక‌ర్‌.. ప్ర‌త్యేక హోదాపై అడిగిన ప్ర‌శ్న‌కు దాట వేత ధోర‌ణి అవ‌లంబించారు. హోదా విష‌యం సీఎం చంద్ర‌బాబు చూసుకుంటార‌ని ఆయ‌న చెప్ప‌డంతో రాజ‌కీయంగా నిరాస‌క్త‌త ఏర్ప‌డింది. ఇంత‌లోనే మ‌రో కేంద్ర మంత్రి తీపి క‌బురు అందించ‌డం విశేషం. ఏదేమైనా.. ఢిల్లీలో ఏపీ గురించి తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతోంద‌నేది వాస్త‌వం.
Tags:    

Similar News