జ‌గ‌న్ ప్ర‌మాణానికి ఏర్పాట్లు ఎంత భారీగా అంటే..?

Update: 2019-05-29 04:45 GMT
మ‌రో రోజులో ఏపీకి ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వాన్ని చేయ‌నున్నారు. జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం కోసం ఏపీ రాష్ట్ర అధికారులు.. కృష్ణా జిల్లా యంత్రాంగం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం జ‌రిగే ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియం సామ‌ర్థ్యం కేవ‌లం 30వేలు మాత్ర‌మే కావ‌టం.. న‌గ‌రం న‌డిబొడ్డున కార్య‌క్ర‌మం జ‌రుగుతుండ‌టంతో ట్రాఫిక్ ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఉండేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియం లోప‌ల‌.. గ్యాల‌రీల్లోనూ ఎల్ ఈడీ స్క్రీన్ల‌ను ఏర్పాటు చేస్తున్నారు.

స్టేడియం మొత్తాన్ని భ‌ద్ర‌తా  ద‌ళాలు త‌మ స్వాధీనంలోకి తీసుకొని.. అణువ‌ణువు త‌నికీ చేస్తున్నారు. స్టేడియం సామ‌ర్థ్యం త‌క్కువ‌గా ఉండ‌టంతో ఎన్నికైన ఎమ్మెల్యేలు త‌మ అనుచ‌ర గ‌ణాన్ని ఎక్కువగా తీసుకురావొద్ద‌ని పోలీసులు కోరుతున్నారు.

ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం నేప‌థ్యంలో నేష‌న‌ల్ హైవే మీద భారీ వాహ‌నాల్ని మ‌ళ్లిస్తూ.. ఆ వివ‌రాల్ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో ప్ర‌మాణ‌స్వీకారానికి గంట ముందు అన్ని రోడ్ల మీద ట్రాఫిక్ ను నిలిపివేస్తారు. ట్రాఫిక్ స‌మ‌స్య‌లు ఎదురైన ప‌క్షంలో హైద‌రాబాద్ నుంచి వ‌చ్చే వాహ‌నాల్ని గొల్ల‌పూడి.. విశాఖ‌ప‌ట్నం వైపు నుంచి ఉంగుటూరు మండ‌లం ఆత్మ‌కూరు వ‌ద్ద నిలిపివేయాల‌ని నిర్ణ‌యించారు. గుంటూరు వైపు వ‌చ్చే వాహ‌నాల్ని కాజా టోల్ ప్లాజా వ‌ద్ద నిలుపుతారు. ఇక‌.. ప్ర‌మాణ‌స్వీకారం జ‌రిగే స్టేడియంలో 13వేల మంది కూర్చునే ఏర్పాట్లు చేశారు. వివిధ వ‌ర్గాల వారు లోప‌ల‌కు వ‌చ్చేందుకు పాసుల్ని సిద్ధం చేశారు. అదే స‌మ‌యంలో బ‌య‌ట సుమారు 12 నుంచి 15 వేల మంది నిల‌బ‌డి స్క్రీన్ల ద్వారా ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వాన్ని తిల‌కించేలా ఏర్పాట్లు చేశారు.

అంద‌రి కంటే ముందు త‌న ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఆహ్వానించారు. ఆ త‌ర్వాత ప్ర‌ధాని మోడీని క‌లిసి ఇన్విటేష‌న్ ఇచ్చారు. మాజీ ముఖ్య‌మంత్రి.. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబును ఆహ్వానించిన జ‌గ‌న్ ప‌నిలో ప‌నిగా ప‌లువురు సీఎంల‌ను ఆహ్వానించారు. త‌న‌కు అత్యంత సన్నిహితుడు.. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ కు అత్యంత స‌న్నిహితుడైన బిహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ ను జ‌గ‌న్ ఆహ్వానించారు. డీఎంకే అధినేత స్టాలిన్.. సీపీఎం..సీపీఐ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు సీతారాం ఏచూరి.. సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డిల‌తో పాటు రాష్ట్ర కార్య‌ద‌ర్శుల్ని ఆహ్వానించారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను కూడా ఇన్ వైట్ చేశారు. ప‌లువురు నేత‌ల్ని త‌న ప్ర‌మాణస్వీకారానికి ఆహ్వానించ‌టం ద్వారా.. జాతీయ స్థాయిలో త‌న‌ను మ‌రింత‌గా ప్రొజెక్ట్ చేసుకునే దిశ‌గా జ‌గ‌న్ అడుగులు వేస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News