హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్ లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ పార్టీలో పాల్గొన్న 90మందికి పైగా అమ్మాయిలు, అబ్బాయిలను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనమైంది. ఇంతమంది ఇక్కడ పట్టుబడడం.. ఇంకొంత మంది పారిపోవడంతో చాలా పెద్ద సంఖ్యలోనే ఇక్కడ పార్టీ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ లోని ఒక రిసార్ట్ లో గుట్టుగా రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు. ఈ పార్టీపై స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో రాచకొండ పోలీసులు రిసార్ట్ పై దాడులు నిర్వహించారు.
దాదాపు 90మంది అబ్బాయిలు, అమ్మాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. రిసార్ట్ లో 20 కార్లు, 60 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దాడులు చేస్తున్న సమయంలో మరికొంత మంది పరారైనట్టు తెలుస్తోంది. వారి కోసం కూడా పోలీసులు గాలింపు చేపట్టారు.
తెల్లవారుజామున పోలీసులు వెళ్లే వరకు అక్కడ అమ్మాయిలు , అబ్బాయిలు మద్యం మత్తులో చిందులేస్తూ కనిపించారు. భారీగా మద్యం బాటిళ్లు కనిపించాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఓ కంపెనీకి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఇక ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున పెద్ద మొత్తంలో కండోమ్ ప్యాకెట్లు కూడా దొరికాయి.